Akhil Gogoi Gets Bail To Take Oath As Assam Mla
Akhil Gogoi: యాక్టివిస్ట్ అఖిల్ గోగొయ్.. డిసెంబర్ 2019 నుంచి జైలులో ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సురభి రాజ్కోన్వారీని 9వేల 64ఓట్లతో ఓడించాడు. ప్రమాణ స్వీకారానికి జైలు శిక్ష అనుభవిస్తున్న గోగొయ్ బెయిల్ మీద బయటకు రానున్నారు. గువాహటిలో మంగళవారం ప్రమాణ స్వీకారం చేయడానికి ఎన్ఐఏ కోర్టు అనుమతించింది.
యాంటీ సిటిజన్‌షిప్ (అమెండ్మెంట్) చట్టం గురించి జరిగిన ఆందోళనలో పాల్గొని అల్లర్లు సృష్టించాడని జైలులో ఉంచారు. కమ్యూనిస్ట్ ప్రభావిత ప్రాంతమైన సిబ్ సాగర్ లో పోటీ చేసి గెలిచాడు. బీజేపీకి చెందిన సురభి రాజ్కోన్వారీని 9వేల 64ఓట్లతో ఇండిపెండెంట్ గా ఓడించాడు. అఖిల్ గోగొయ్ కోసం తల్లి ప్రియోదా గోగొయ్ చేసిన ప్రచారం బాగా పనికొచ్చింది.
యాంటీ సీఏఏ సెంటిమెంట్లు స్థానికంగా ప్రభావం చూపించడంతో విజయం ఖాయమైంది. సోషియో పొలిటిక్ ఆర్గనైజేషన్ లో సభ్యుడిగా మాత్రమే కాకుండా సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్)తో కలిసి 1990 నాటి నుంచి పని చేస్తున్నాడు.
జులై 2020లో గోగొయ్ కు కొవిడ్ పాజిటివ్ రావడంతో గువాహటిలోని మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. ఆరోగ్య సమస్యలు ఉండటంతో హాస్పిటల్ లోనే ఉంచారు.