AKhilesh Yadav: మోదీ పనితీరు నచ్చే బీజేపీలో చేరా – అఖిలేశ్ యాదవ్ మరదలు

భారత ప్రధాని మోదీ పనితీరునచ్చి తాను బీజేపీలో చేరానంటున్నారు అఖిలేశ్ యాదవ్ మరదలు అపర్ణ యాదవ్, తమ్ముడు ప్రతీక్ భార్య అయిన అపర్ణ బీ అవేర్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళల సమస్యలపై....

AKhilesh Yadav: భారత ప్రధాని మోదీ పనితీరునచ్చి తాను బీజేపీలో చేరానంటున్నారు అఖిలేశ్ యాదవ్ మరదలు అపర్ణ యాదవ్, తమ్ముడు ప్రతీక్ భార్య అయిన అపర్ణ బీ అవేర్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళల సమస్యలపై పోరాడుతున్నారు.

అంతేకాకుండా లక్నోలో గోవుల సంరక్షణ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిగా లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్ధి రీటా బహుగుణ చేతిలో ఓటమికి గురయ్యారు. ఆ తర్వాత బహుగుణ కూడా బీజేపీలోకి చేరిపోయారు.

‘బీజేపీకి కృతజ్ఞురాలిగా ఉంటాను. ముందు నాకు దేశమే గొప్. ప్రధాని పనితనాన్ని అభినందిస్తున్నా. బీజేపీ పనులు నాపై ప్రభావం చూపిస్తున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్, మహిళా సంక్షేమం, ఉద్యోగ కల్పన లాంటివి నాకు బాగా నచ్చాయి. నా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాను’ అని పార్టీలోకి జాయిన్ అయిన సందర్భంగా వెల్లడించారు.

ఇది కూడా చదవండి: కరోనా పరీక్షలపై కేంద్రం కీలక ఆదేశాలు..!

అపర్ణ.. బీజేపీ కార్యక్రమాల్లో గతంలోనూ పాల్గొన్నారు. అయోద్యలోని రామ్ మందిర నిర్మాణానికి రూ.11లక్షలు విరాళంగా ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్ లో ఫిబ్రవరి 10నుంచి జరగనున్న ఏడు దశల ఎన్నికల ప్రకియలో 403అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, మార్చి 7తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ మార్చి10నుంచి మొదలవుతుంది.

ట్రెండింగ్ వార్తలు