Akhilesh Yadav’s Wife : అఖిలేష్ భార్య,కూతురికి కరోనా

: సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురు టినా యాదవ్ కోవిడ్ బారినపడ్డారు. వీరిద్దరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని

Akilesh Wife

Akhilesh Yadav’s Wife : సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురు టినా యాదవ్ కోవిడ్ బారినపడ్డారు. వీరిద్దరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని,ప్రస్తుతం లక్నోలోని తమ నివాసంలోనే వీరు ఐసొలేట్ అయినట్లు సమాచారం.

వీరిద్దరి సోకింది కోవిడ్ కొత్త వేరియంటా “ఒమిక్రాన్” అన్నది తేల్చేందుకు శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు అధికారులు. ఇక,వీరి కుటుంబంలోని సిబ్బందికి కూడా కోవిడ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కాగా,అఖిలేష్ యాదవ్ ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో అఖిలేష్ కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.

ALSO READ President Candidate 1 vote : ప్రెసిడెంట్ అభ్యర్థికి ఒకే‘ఒక్క’ ఓటు..సొంత ఇంట్లోనే 12మంది ఓటర్లున్నా..ఎవ్వరు వెయ్యలేదు..