President Candidate 1 vote : ప్రెసిడెంట్ అభ్యర్థికి ఒకే‘ఒక్క’ ఓటు..సొంత ఇంట్లోనే 12మంది ఓటర్లున్నా..ఎవ్వరు వెయ్యలేదు..

ప్రెసిడెంట్ అభ్యర్థికి ఒకే‘ఒక్క’ ఓటు పడింది. తన సొంత ఇంట్లోనే 12మంది ఓటర్లున్నా..ఎవ్వరు ఆయనకు ఓటు వెయ్యలేదు..

President Candidate 1 vote : ప్రెసిడెంట్ అభ్యర్థికి ఒకే‘ఒక్క’ ఓటు..సొంత ఇంట్లోనే 12మంది ఓటర్లున్నా..ఎవ్వరు వెయ్యలేదు..

Panchayat Candidate With 12 Voters In Family Gets Just 1 Vote

panchayat President Candidate with 12 voters in family gets just 1 vote : గ్రామానికి ప్రెసిడెంట్ కావాలని ఆశ పడ్డాడు ఓ యువకుడు. నామినేషన్ వేశాడు. గెలుస్తాననే నమ్మకం లేకపోయినా తన ఇంట్లో 12 ఓట్లు ఉన్నాయి కదా..వాటితో పాటు తమ బంధువులు వేయకపోతారా? అనుకున్నాడు. బంధువులు ఎలా ఉన్నా..తమ ఇంట్లోవారి ఓట్లు అన్నా పడకపోతాయేంటీ?అనుకున్నాడు. కానీ అతని నమ్మకం వమ్ము అయ్యింది.తమ ఇంట్లో వారు ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా అతనికి ఓటు వేయలేదు. కానీ తన ఓటు తాను వేసుకోవటంతో ఒకే ఒక్క ఓటు నమోదు అయ్యింది ఆ ప్రెసిడెంట్ అభ్యర్థికి. గుజరాత్‌ పంచాయతీ ఎన్నికల్లో ఈ అనూహ్య సంఘటన జరిగింది.

Read more : Priyanka Chopra: పేరు చివర భర్త పేరు తొలగింపు.. పీసీ రియాక్షన్ ఇదే

గుజరాత్‌లో ఇటీవల దశల వారీగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వాపీ జిల్లాలోని ఛార్వాలా గ్రామంలో సంతోష్‌ అనే వ్యక్తి సర్పంచ్ పదవికి నామినేషన్‌ వేశాడు. ఆయన కుటుంబంలో మొత్తం 12 మంది ఓటర్లున్నారు. సర్పంచ్ ఎన్నికల పోటీలో సంతోష్‌ ప్రధాన అభ్యర్థి కాదు. కానీ గెలవకపోయినా పోటీ చేయాలనుకున్నాడు. కనీసం తన కుటుంబసభ్యుల ఓట్లయినా వస్తాయని నమ్మాడు సంతోష్.

ఎన్నికల పూర్తి అయ్యాక కౌటింగ్‌ చేయగా సంతోష్‌కు కేవలం ఒకే ఒక్క ఓటు పడినట్లుగా తేలింది. దీంతో సంతోష్ నిర్ఘాంతపోయాడు. కనీసం మా ఇంట్లోవారు కూడా నాకు ఓటు వేయలేదా?అని ఆశ్చర్యపోయాడు. ఆ వచ్చిన ఓటు కూడా ఆయన వేసుకున్నదే. అలా ఒకే ఒక్క ఓటు నమోదు అయ్యింది ప్రెసిడెంట్ అభ్యర్థి సంతోష్ కు. కనీసం కుటుంబసభ్యులు తనకు ఓటు వేయకపోవడంతో పోలింగ్‌ కేంద్రం వద్దే సంతోష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Read more : Property Dispute : ఆస్తి కోసం తల్లిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళిన మున్సిపల్ చైర్మన్