అయోధ్య భూ వివాదం మరోసారి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనుంది. అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నిర్ణయించింది. దీంతో మరోసారి సుప్రీం కోర్టుకు అయోధ్య వివాదం రానుంది. డిసెంబర్ 9లోపు పిటీషన్ వేయాబోతున్నట్లు ఆలిండిచా ముస్లిం లాబోర్డ్ ప్రకటించింది. వివాదాస్పద స్థలమైన 2.77 ఎకరాల స్థలాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ కు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ.. ముస్లిం లా బోర్డు అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఈ పిటీషన్ వేయాలని నిర్ణయించింది.
తమకు ఐదు ఎకరాల స్థలాన్ని మరో ప్రాంతంలో ఇవ్వాలని తీర్పు ఇవ్వటంపై ముస్లిం లాబోర్డ్ వ్యతిరేకిస్తోంది. రామ జన్మభూమి భూమి వివాదంపై దశాబ్దాల పాటు కొనసాగిన ఈ కేసు తీర్పును నవంబర్ 9 సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై రివ్యూకు వెళతామని ఆలిండియా ముస్లిం లా బోర్డు ప్రకటించింది.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం భిన్నవాదనలు కొసాగిన అనంతరం ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు మంగళవారం (నవంబర్ 26)న సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న సున్నీ వక్స్ఫ్ బోర్డ్ సుప్రీం కోర్టు తీర్పుపై తాము రివ్వ్యూకు వెళ్లబోమని స్పష్టంచేసింది. దీంతో ఆల్ ఇండియా ముస్లిం సంఘాల్లో కొన్ని సంఘాలు మాత్రం సుప్రీం కోర్టు తీర్పుని వ్యతిరేకించాయి. రివ్వ్యూకు వెళ్లాలని సూచించాయి. దీంతో ఆలిండియా ముస్లిం లా బోర్డు రివ్వ్యూకు వెళ్లాలని నిర్ణయించింది. కాగా..ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుందా? లేదో వేచి చూడాల్సిందే.