కోడలి నుంచి భరణం కోరిన అత్తమామలు.. ఇదో చిత్రమైన కేసు.. కోర్టు తీర్పు చూస్తే..
Allahabad High Court : కుమారుడి మరణాంతరం వచ్చిన ఆర్థిక ప్రయోజనాలను కోడలే తీసుకుందని, అందువల్ల తమ పోషణను కూడా ఆమే చూసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరారు.
- Harishth Thanniru
- Updated on- March 30, 2026 / 02:29 PM IST
Allahabad High Court
- కోడలు భరణం ఇవ్వాలంటూ హైకోర్టులో అత్తామామలు పిటీషన్
- చట్టపరంగా కోడలికి అలాంటి కట్టుబాట్లు ఏవీలేవు
- స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు
Allahabad High Court : అత్తమామలను పోషించే విషయంలో కోడలి పాత్రపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారతీయ కుటుంబ వ్యవస్థలో అత్తమామల పోషణ అనేది కోడలిపై ఉన్న సామాజిక బాధ్యతగా కనిపిస్తున్నప్పటికీ.. చట్టపరంగా కోడలికి అలాంటి కట్టుబాట్లు ఏమీ లేవని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read : Visakhapatnam : పక్కా ప్లాన్ ప్రకారమే.. విశాఖలో యువతి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
ఉత్తరప్రదేశ్ లో పోలీసు కానిస్టేబుల్ గా పనిచేసిన ఓ వ్యక్తికి 2016లో వివాహం జరిగింది. 2021లో అతను ఓ ప్రమాదంలో మరణించాడు. ఆయన భార్య కూడా కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. కుమారుడిపై ఆధారపడి తాము జీవించేవారమని, ఆయన మరణంతో తాము దిక్కులేనివారమయ్యామని పేర్కొంటూ తల్లిదండ్రులు తొలుత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.
కుమారుడి మరణాంతరం వచ్చిన ఆర్థిక ప్రయోజనాలను కోడలే తీసుకుందని, అందువల్ల తమ పోషణను కూడా ఆమే చూసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే, ఫ్యామిలీ కోర్టు వారి వినతిని తిరస్కరించింది. పోషించాల్సిన చట్టబద్దమైన బాధ్యత కోడలిపై లేదంటూ కోర్టు పేర్కొంది. దీంతో వృద్ధ దంపతులు అలహాబాద్ లోని హైకోర్టులో అప్పీలు చేశారు.
హైకోర్టులో ఈ కేసును విచారించిన జస్టిస్ మదన్ పాల్ సింగ్ ధర్మాసనం.. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్‌ఎస్) లోని సెక్షన్ 144 (గతంలో సీఆర్‌పీసీ సెక్షన్ 125) పరిధిని విశ్లేషించింది. ఈ చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి తనపై ఆధారపడిన భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు మాత్రమే భరణం చెల్లించాల్సి ఉంటుంది. శాసనకర్తలు తమ విచక్షణతో అత్తమామలను ఈ చట్ట పరిధిలోకి చేర్చలేదు. అంటే కోడలిపై అత్తామామల పోషణ బాధ్యతను మోపడం చట్టం ఉద్దేశం కాదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
