American Woman : కేరళలో అమెరికా మహిళపై సామూహిక అత్యాచారం

ఈ నేపథ్యంలో జులై31న అశ్రమం వద్ద ఉన్న బీచ్ లో మహిళ ఒంటరిగా కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో స్నేహం చేశారు.

American woman

American Woman Gang-Raped : కేరళలో(Kerala) దారుణం జరిగింది. అమెరికా మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆశ్రమంలో ఉంటున్న సదరు మహిళపై అఘాయిత్యం చేశారు. జులై 22న అమెరికాకు(America) చెందిన మహిళ కేరళకు వచ్చారు. ఆమె ఓ అశ్రమంలో ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో జులై31న అశ్రమం వద్ద ఉన్న బీచ్ లో మహిళ ఒంటరిగా కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో స్నేహం చేశారు. అనంతరం మహిళను ఓ ఖాళీ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.

Kerala: కేరళలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. గొంతునులిమి హత్య ..

ఆగస్టు1న బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరుణగప్పల్లి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులు కొల్లామ్ కు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.