Ladakh: ఎముకలు కొరికే చలిలో ఆర్మీ అధికారి సూర్య నమస్కారాలు.. వీడియోచూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
గడ్డకట్టే చలిలో కూడా జవాన్లు పగలు, రాత్రి లెక్కచేయకుండా దేశ రక్షణకోసం గస్తీ కాస్తుంటారు. గస్తీ సమయంలో వారుచేసే సాహసాలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి. తాజాగా ఓ అధికారి గడ్డకట్టే చలిలో సూర్య నమస్కారాలు చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
- Harishth Thanniru
- Published On : July 20, 2022 / 08:40 PM IST
Ladhak
Ladakh: గడ్డకట్టే చలిలో కూడా జవాన్లు పగలు, రాత్రి లెక్కచేయకుండా దేశ రక్షణకోసం గస్తీ కాస్తుంటారు. గస్తీ సమయంలో వారుచేసే సాహసాలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి. తాజాగా ఓ అధికారి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చొక్కాలేకుండా గడ్డకట్టే చలిలో ఆయన చేసిన సూర్యనమస్కారాల వీడియో నెటిజన్లను ఫిదా చేస్తోంది.
Vladimir Putin: పుతిన్‌కు ఘోర అవమానం..! ఎర్డోగన్ కావాలనే అలా చేశాడా? వైరల్‌గా మారిన వీడియో
ఇండో-టిబెటన్ సరిహద్దులోని లడఖ్‌లో 18,000 అడుగుల ఎత్తులో చొక్కా లేకుండా ఓ ఐటిబీపీ అధికారి సూర్య నమస్కారాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ట్విట్టర్‌లో ANI షేర్ చేసిన వీడియోలో.. ఎత్తైన ప్రదేశంలో సరిహద్దు ఐటీబీపీ అధికారి జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రతల మధ్య మంచు ప్రదేశంలో విభిన్న భంగిమల్లో ‘సూర్య నమస్కార్’ చేశాడు. ఇండో-టిబెటన్ బోర్డర్ అధికారి ధైర్యం, ఫిట్‌నెస్ ప్రదర్శించడాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
#WATCH | An ITBP officer practicing 'Surya Namaskar' at 18,000 feet in Ladakh in snow conditions & sub-zero temperatures
(Source: ITBP) pic.twitter.com/URB8CIMHQk
— ANI (@ANI) July 20, 2022
ఇంత ఎత్తైన ప్రదేశంలో.. అదీ గడ్డకట్టే చలిలో చొక్కా విప్పిమరీ యోగాసనాలు చేసిన అధికారి పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో పోస్టు అయిన కొద్ది గంటల్లోనే లక్షల మంది వీక్షించారు. మరోవైపు వీడియో చూసిన అధికారులుసైతం సూర్యనమస్కారాలు చేసిన అధికారిని ప్రసంశిస్తున్నారు.
