Vladimir Putin: పుతిన్‌కు ఘోర అవమానం..! ఎర్డోగన్ కావాలనే అలా చేశాడా? వైరల్‌గా మారిన వీడియో

రష్యా అధ్యక్షుడు వ్లాదిమ్ పుతిన్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఇరాన్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో పుతిన్ సమావేశం అయ్యారు. సమావేశంకు ముందు ఎర్డోగన్ కోసం పుతిన్ కొద్దిసేపు వేదికపై నిలుచుకొని ఎదురుచూడాల్సి వచ్చింది. వేదికపైకి పుతిన్ వచ్చే సమయంలో ఆహ్వానించేందుకు కూడా ఎవరూ రాలేదు. దీంతో పుతిన్ కొద్దిసేపు అలాగే నిలుచుండి పోయారు.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.. అయితే ఎర్డోగన్ కావాలనే పుతిన్ ను అవమానించారన్న వాదన వినిపిస్తుంది.

Vladimir Putin: పుతిన్‌కు ఘోర అవమానం..! ఎర్డోగన్ కావాలనే అలా చేశాడా? వైరల్‌గా మారిన వీడియో

Putin01

Vladimir Putin: ప్రపంచ వ్యాప్తంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు మారుమోగిపోతుంది. యుక్రెయిన్ పై యుద్ధం ప్రారంభ సమయం నుంచి ప్రపంచ దేశాల్లోని ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో పుతిన్ పేరు తరచు వినిపిస్తుంది. అధిక శాతం దేశాల్లో పుతిన్ ను నియంతగా అక్కడి ప్రజలు సంబోధిస్తుంటారు. అనేక దేశాలు పుతిన్ కు వ్యతిరేఖంగా మారాయి. రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. అయినా పుతిన్ ఎక్కడా వెనక్కు తగ్గకుండా యుక్రెయిన్ పై ఇప్పటికీ తమ సైన్యంతో దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి.

Putin

ప్రస్తుత పరిస్థితుల్లో అనేక దేశాధ్యక్షులకు పుతిన్ అంటే చాలా కోపం. యుక్రెయిన్ పై యుద్ధమనే కాకుండా.. ఎవరైనా పుతిన్‌ను కలవాలంటే కొన్ని గంటల పాటు వెయిట్ చేయించి అవమానిస్తారనే ప్రచారం ఉంది. అలాంటిది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇరాన్ లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తో సమావేశంకు వచ్చిన పుతిన్.. సుమారు 50 సెకన్ల పాటు స్టేజీపై ఒక్కరే నిలుచుండిపోయారు. పుతిన్ స్టేజీ ఎక్కే సమయంలోనూ ఎవరూ స్వాగతం పలకలేదు. కనీసం ఒక్కరుకూడా స్టేజీపై కనిపించలేదు. దీంతో పుతిన్ ఒంటరిగా స్టేజీపై అలా నిలుచుండిపోయారు. కొద్దిసేపటి తరువాత ఎర్డోగన్ వచ్చి పుతిన్ తో కరచాలనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఎర్డోగన్ కావాలనే అలా చేశాడా? కాకతాలీయంగా అలా జరిగిపోయిందా అనేది తెలియనప్పటికీ.. పుతిన్ పై కోపంగాఉన్న నెటిజన్లు మాత్రం సోషల్ మీడియాలో కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

2020లో ఎర్డోగన్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైందని టర్కీ మీడియా పేర్కొంది. ఆ సమయంలో మాస్కోలో పుతిన్ తో సమావేశం అయ్యేందుకు ఆయన రెండు నిమిషాల పాటు వేచి చూడాల్సి వచ్చిందని టర్కీ మీడియా చెప్పుకొచ్చింది. దీనిని బట్టిచూస్తే కావాలనే ఎర్డోగన్ పుతిన్ ను వెయిట్ చేయించాడని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. మరోవైపు యుక్రెయిన్ తో యుద్ధం తర్వాత పుతిన్ పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.