Punjab : రెచ్చిపోయిన ఆవు.. వృద్ధుడిని 100 మీటర్లు ఈడ్చుకెళ్లి చంపేసిన భయానక వీడియో వైరల్
ఓ ఆవు భీభత్సం సృష్టించింది. రెచ్చిపోయి ఓ వృద్ధుడిపై దాడి చేసింది. 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లి చంపేసింది. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్ అవుతోంది.
- Lakshmi 10tv
- Published on- September 2, 2023 / 01:01 PM IST
Punjab
Punjab : పంజాబ్‌లో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. వృద్ధుడిపై దాడి చేసింది. 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో పెద్దాయన కన్నుమూసాడు. సీసీటీవీలో రికార్డైన విజువల్స్ షాక్‌కి గురిచేసాయి.
మొహాలీలోని పన్లో ఓ ఆవు విపరీతంగా ప్రవర్తించింది. పగబట్టినట్లు 83 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసింది. 100 మీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. తనను రక్షించుకోవడానికి ఆ పెద్దాయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. రోడ్డుపై వాహనాలు వెళ్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో వృద్ధుడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.
Chhattisgarh village : పిడుగులు పడకుండా ఆవుపేడ పూత..గ్రామంలో ఇళ్ల గోడలపై వింత డిజైన్లు
ఈ ఘటనలో చనిపోయిన పెద్దాయన పేరు సరూప్ సింగ్‌గా తెలుస్తోంది. ఆవు అతనిని ఈడ్చుకెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫుటేజ్ చూసి నెటిజన్లు షాకయ్యారు.
