Chhattisgarh village : పిడుగులు పడకుండా ఆవుపేడ పూత..గ్రామంలో ఇళ్ల గోడలపై వింత డిజైన్లు

ఆవుపేడ ఇంటికి రక్షణనిస్తుందా? ఆవుపేడతో గీతలు ఇంటికి ప్రమాదం జరగకుండా కాపాడతాయా? ఆవుపేడ పిడుగులు పడకుండా నివాసాలను కాపాడుతుందా? ఆగ్రామంలో ప్రజలంతా అదే నమ్ముతారు. అందుకే వారి ఇళ్ల గోడలపై పేడతో వింత వింత డిజైన్లు గీసుకుంటారు.

Chhattisgarh village : పిడుగులు పడకుండా ఆవుపేడ పూత..గ్రామంలో ఇళ్ల గోడలపై వింత డిజైన్లు

Cow dung protection for the house

Cow dung protection for the house : భారతదేశంలో ఎన్ని ఆచారాలు..మరెన్నో సంప్రదాయాలు. ఈ ఆధునిక యుగంలో కూడా భారత్ లో వింత వింత సంప్రదాయాలను పాటిస్తునే ఉన్నారు. మరి ముఖ్యంగా భారత్ లో ఆవుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఆవును గోమాతగా కొలుస్తారు. పూజిస్తారు. ఆవుపేడ, ఆవుమూత్రం, ఆవు నెయ్యి ఇలా ఆవుతో పెనవేసుకున్న సెంటిమెంట్ అంతా ఇంతాకాదు. ఆవుపేడ రక్షణ ఉంటే ఇళ్లపై పిడుగులు పడవని నమ్ముతోంది ఛత్తీస్ గఢ్ లోని ఓ గ్రామం. ఆవు పేడతో ఇంటి గోడలపై వింత వింత డిజైన్లు కనిపిస్తాయి ఆ గ్రామం అంతా. ప్రతీ ఇంటి గోడపై ఆవుపేడతో రక్షణ గీతలాంటిది గీసుకుంటారు. ఆవుపేడ రక్షణగా ఉంటే తమ ఇళ్లపైనే కాదు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో పిడుగులు పడవని నమ్ముతారు ఆ గ్రామంలో ప్రజలంతా.

ఛత్తీస్‌గఢ్‌(chhattisgarh)లోని సూరజ్‌పూర్‌(Surajpur)లో కొలియారి గ్రామ (Koliari village)ప్రజలు ఆవుపేడతో ( cow dung protects)ఇంటి గోడలపై వింత వింత ఆకారంలో గీతలు గీస్తారు. అవే తమ ఇళ్లకు రక్షణ రేఖలు అని భావిస్తుంటారు. ఈ ఆచారాన్ని గ్రామంలో ప్రతీ ఇల్లు పాటిస్తుంది. ఆవు పేడతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకుంటే పిడుగుపాట్ల నుంచి తమను రక్షిస్తుందని చెబుతారు గ్రామస్తులంతా.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. కొడియాల వద్ద చిక్కుకున్న తెలుగు యాత్రికులు

ఆవు పేడ నిల్వ ఉన్న ప్రదేశాలలో పిడుగు పడదని నమ్ముతారు. గ్రామస్తులంతా ఆవులను చాలా పవిత్రంగా చూస్తారు. ఆవు పేడకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గ్రామంలో ఏఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా ఆవుపేడతో పూత పూసి పనులు ప్రారంభిస్తారు. ఆవు పేడతో ఇంటిని అలంకరిస్తారు. గ్రామంలోని ప్రతి ఇంటి గోడలపై ఆవుపేడతో భద్రతా వలయం కనిపిస్తుంది.

ఆవుపేడతో ఇలా చేస్తే తమ ఇల్లు సురక్షితంగా ఉంటుందని..పిడుగుల నుండి ఉపశమనం కలగడమే కాకుండా..పాములు, తేళ్ల వంటి విషపు జీవులు నుంచి కూడా తమకు రక్షణ ఉంటుందని భావిస్తారు. క్రిమికీటకాలు కూడా ఇంటిలోకి ప్రవేశించవని నమ్ముతారు.