Heart Attack Driver Died : బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు.. స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో విషాదం నెలకొంది. బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు. బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఓ వృద్ధుడు మృతి చెందారు.

  • Updated on- December 3, 2022 / 09:17 AM IST

RTC driver died

Heart Attack Driver Died : మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో విషాదం నెలకొంది. బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు. బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఓ వృద్ధుడు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్ దేవ్ పటేల్ అనే వ్యక్తి జబల్ పూర్ లో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రతి రోజు లాగే శుక్రవారం కూడా  అతను తన విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బస్సు నడుపుతుండగా అకస్మాత్తుగా అతనికి తీవ్ర గుండెపోటు రావడంతో స్టీరింగ్ పైనే మృతి చెందారు. దీంతో అదుపుతప్పిన బస్సు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగివున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ముందున్న వాహనాలను ఢీ కొడుతూ కూడలి మధ్యలోకి వెళ్లి ఆగిపోయింది.

RTC Driver Died : బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు..బస్సులోనే మృతి

ఆటో, బైకులను కొంత దూరం లాక్కెళ్లి బస్సు నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందారు. మరికొందరికి గాయలయ్యాయి. అయితే లోఫ్లోర్ బస్సు కావడంతో బస్సు కింద ఎవరూ పడలేదని పోలీసులు పేర్కొన్నారు.