Anand Mahindra: ఆనంద్ మహీంద్రా 2021 ఆఖరి ట్వీట్.. ‘ఆశావాదం బతకాలి’

ఇండియాలోని టాప్ ఇండస్ట్రీయలిస్ట్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ లు కచ్చితంగా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మనసుకు హత్తుకుపోయే వీడియోలు, ఫొటోలు, చమత్కరించే పోస్టులు లాంటివి వైవిధ్యంగా...

Ana

Anand Mahindra: ఇండియాలోని టాప్ ఇండస్ట్రీయలిస్ట్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ లు కచ్చితంగా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మనసుకు హత్తుకుపోయే వీడియోలు, ఫొటోలు, చమత్కరించే పోస్టులు లాంటివి వైవిధ్యంగా పోస్టు చేస్తుంటారు. అలాంటి ఫొటోనే 2021 ఏడాదిలో చివరిగా పోస్టు చేశారు ఆనంద్. దాంతో పాటు మరోసారి చదవాలనిపించే కొటేషన్ యాడ్ చేశారు.

‘ఈ సంవత్సరంలో నాకు ఫేవరేట్ ఫోటో ఇదే. తీసిన వారెవరో తెలియకుండానే వాడేశాను క్షమించండి. నా ఇన్‌బాక్స్‌లో కనిపించింది. ఆశ, కృషి, ఆశావాదం ఎన్ని కనిపిస్తున్నాయి ఈ ఫొటోలో. ఎందుకు జీవిస్తున్నామో దాని సారాంశం తెలియాలి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ పోస్టు పెట్టారు.

80వేల మంది ఈ ఫొటోను ఇష్టపడుతున్నట్లుగా హార్ట్ సింబల్ ఇవ్వగా.. 9వేల మంది రీట్వీట్ చేశారు. వెయ్యి మందికి పైగా దీని గురించి కామెంట్ చేశారు.

ఇది కూడా చదవండి : టీఎస్ఆర్టీసీ తాత్కాలిక సిబ్బందికి గుడ్ న్యూస్