Anand Mahindra: ట్విట్టర్ యూజర్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే సమాధానం
సరదా వీడియోని, ఆసక్తికరమైన సమాచారాన్ని షేర్ చేసి.. దానిపై నెటిజెన్ల అభిప్రాయాన్ని కోరుతుంటారు ఆనంద్ మహీంద్రా. అయితే ఇటీవల ట్విట్టర్లో ఆయనకు ఒక ఊహించని ప్రశ్న ఎదురైంది.
- Bharath Reddy
- Published On : January 9, 2022 / 09:05 AM IST
Anand
Anand Mahindra: సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే వ్యాపారవేత్తల్లో మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో ఆనంద్ మహీంద్రా పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. అపుడప్పుడు ఏదైనా సరదా వీడియోని, ఆసక్తికరమైన సమాచారాన్ని షేర్ చేసి.. దానిపై నెటిజెన్ల అభిప్రాయాన్ని కోరుతుంటారు ఆనంద్ మహీంద్రా. అయితే ఇటీవల ట్విట్టర్లో ఆయనకు ఒక ఊహించని ప్రశ్న ఎదురైంది. నెటిజన్ల నుంచి ఇబ్బందిపడే రీతిలో ఎదురైనా ఆప్రశ్నకు.. ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also read: Weather Report: తెలంగాణలో పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం
ట్విట్టర్లో ఆనంద్ మహీంద్రాను ఫాలో అవుతున్న కౌశిక్ అనే యువకుడొకరు.. “సార్ మీరు ఏ మతానికి చెందినవారు. ఇలా అడగడం తెలివితక్కువని తెలుసు. నన్ను తెలివితక్కువ వాడిననే అనుకోండి. కానీ నా ప్రశ్నకు బదులివ్వండి. మీరు పంజాబీనా?” అంటూ ఆ యూజర్ ప్రశ్నించాడు. ఈప్రశ్నకు సమయస్ఫూర్తితో స్పందించిన ఆనంద్ మహీంద్రా, “ఇదేం తెలివితక్కువ ప్రశ్నకాదు, నేను సూటిగా సమాధానం చెబుతున్నా.. నేను భారతీయుడిని” అంటూ సమాధానం ఇచ్చారు. అనాలోచితంగా ఆ యువకుడు అడిగిన ప్రశ్నకు తగినరీతిలో ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానం పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సమాధానం అనంతరం ఆ యువకుడు ఆ పోస్టును తొలగించడంతో పాటు తన ట్విట్టర్ ఖాతాను తొలగించడం విశేషం.
Not a stupid question but my straight answer is that I’m an Indian.. https://t.co/MrrmP9cGuE
— anand mahindra (@anandmahindra) January 8, 2022
Also read: India-America: అమెరికాకు మన మామిడి, దానిమ్మ, అక్కడి నుంచి మనకు గడ్డి దిగుమతి
