India-America: అమెరికాకు మన మామిడి, దానిమ్మ, అక్కడి నుంచి మనకు గడ్డి దిగుమతి

భారత్ లో పండిన మామిడి పండ్లపై ఎన్నో ఏళ్లుగా విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. దీంతో భారత్ లో పండే మామిడి, దానిమ్మ పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం అయింది

India-America: అమెరికాకు మన మామిడి, దానిమ్మ, అక్కడి నుంచి మనకు గడ్డి దిగుమతి

Mangoea

India-America: అమెరికాలో జో బైడెన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత్ అమెరికా మధ్య బంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సారధ్యంలో రద్దైన కొన్ని ట్రేడ్ సమస్యలు తొలగిపోయి.. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పుంజుకున్నాయి. తాజాగా ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ ఒప్పందాల ప్రకారం భారత్ లో పండిన మామిడి పండ్లపై ఎన్నో ఏళ్లుగా విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. దీంతో భారత్ లో పండే మామిడి, దానిమ్మ పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం అయింది.

Also read: Ramesh Babu : బిజినెస్‌మెన్ స్పెషల్ షోలో రమేష్‌బాబుకు నివాళులు అర్పించిన అభిమానులు

ఫలితంగా అమెరికా నుంచి చెర్రీ పండ్లను, అల్ఫాల్ఫా పశుగ్రాసాన్ని, పంది మాంసాన్ని భారత్ లోకి దిగుమతి చేసుకోనున్నారు. ఈమేరకు శనివారం ఇరు దేశాల వాణిజ్య మంత్రిత్వశాఖలు ఈ ఒప్పందాలు చేసుకున్నాయి. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను పరస్పరం ఇచ్చుపుచ్చుకునే (“2 Vs 2 Agri market access issues”) పద్ధతిలో ఈ ఒప్పందం జరిగినట్టు అమెరికా అధికారులు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈప్రకారం 2022 జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి భారత్ నుంచి మామిడి ఎగుమతులు ప్రారంభం కానున్నాయి.

Also read: IT Raids : మధ్యప్రదేశ్‌లో ఐటీ దాడులు.. అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంకులో దాచిన రూ.8కోట్లు, నగలు సీజ్

2022 ఏప్రిల్ నుంచి దానిమ్మ ఎగుమతులు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ లోనే అమెరికా నుంచి దిగుమతులు ప్రారంభం కానున్నాయి. కాగా భారత్ నుంచి అమెరికాకు మామిడి ఎగుమతులకు అనుమతులు లభించడంతో మామిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో కొన్ని ప్రాంతాల్లో మే, జూన్ నెలల్లో మామిడి పంట చేతికి వస్తుండగా, దేశీయంగా అమ్మకాలు అందుకోవడం లేదు. దీంతో మామిడి రైతులు కొంత నష్ట పోతున్నారు. అయితే అమెరికాకు మామిడి ఎగుమతులతో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని రైతులు, ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Also read: Andhra Pradesh : ఆత్మకూరులో టెన్షన్..టెన్షన్