Viral News: కరోనా సోకిన కుమారుడిని కారు డిక్కీలో ఇరికించిన తల్లి, చివరకు అరెస్ట్

కరోనా సోకిన కుమారుడిని.. కారులో తన పక్కన కూర్చోబెట్టుకోలేని ఓ తల్లి, అతన్ని కారు వెనుక డిక్కీలో కుక్కి.. కోవిడ్ టెస్ట్ సెంటర్ కు తీసుకెళ్లింది.

Viral News: కరోనా సోకిన కుమారుడిని కారు డిక్కీలో ఇరికించిన తల్లి, చివరకు అరెస్ట్

Mom

Viral News: కరోనా మహమ్మారి మానవ సంబంధాలపై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలిపే ఘటన ఇది. కరోనా సోకిన కుమారుడిని.. కారులో తన పక్కన కూర్చోబెట్టుకోలేని ఓ తల్లి, అతన్ని కారు వెనుక డిక్కీలో కుక్కి.. కోవిడ్ టెస్ట్ సెంటర్ కు తీసుకెళ్లింది. కనీసం కుమారుడిని పట్టుకుని బయటకు దించేందుకు కూడా ఆమె అంగీకరించలేదు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో నివసిస్తున్న సారా బీమ్ అనే మహిళ.. జనవరి 3న.. కరోనా సోకిన తన కుమారుడిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లింది. కారు డిక్కీలో ఉన్న తన 13 ఏళ్ల కుమారుడికి కరోనా పరీక్ష చేయాలంటూ అక్కడి వైద్యసిబ్బందిని పిలిచింది. కారులోనే ఉంచి బాధితులకు కరోనా పరీక్ష నిర్వహిస్తారు అక్కడి టెస్ట్ సెంటర్లో.

Also read: Ramesh Babu: కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

అయితే బాలుడు కారు డిక్కీలో ఉండడంతో అతన్ని బయటకు తీయాలంటూ సారా బీమ్ ను కోరారు వైద్య సిబ్బంది. అయితే వైరస్ సోకిన తన కుమారుడిని పట్టుకునేందుకు ఆ తల్లి నిరాకరించింది. “టెస్ట్ చేస్తే చేయండి.. లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోతా” అంటూ వైద్యసిబ్బందితో కొంతసేపు వాదించింది. చివరకు వారు ససేమిరా అనడంతో తన కుమారుడితో సహా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే బాలుడు కారు డిక్కిలోనే ఉండడంతో అతన్ని రక్షించేందుకు వైద్యసిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సారా కారు నెంబర్ ఆధారంగా ఆమె అడ్రెస్స్ ను కనుగొన్న పోలీసులు..చైల్డ్ ప్రొటెక్షన్ చట్టాల ప్రకారం సారా బీమ్ ను అరెస్ట్ చేశారు.

Also read: Andhra Pradesh : ఆత్మకూరులో టెన్షన్..టెన్షన్