జనగణమన పాడిన బుడ్డోడు..ఆనంద్ మహీంద్ర ఫిదా..మీరు ఇష్టపడుతారు

  • Publish Date - August 15, 2020 / 11:49 AM IST

జనగణమన..అధినాయక జయహే..అంటూ వచ్చిరానీ మాటలతో బుడ్డోడు పాడిన పాటకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త..సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే..ఆనంద్ మహీంద్ర (Anand Mahinda) పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.



Twitter వేదికగా Tweet చేశారు. ఈ వీడియోలో చిన్నోడు..ఎంతో ఆసక్తితో జనగణమన పాడుతున్నాడు. ఎక్కడ ఏకాగ్రత పోతుందోనని మరీ కళ్లు మూసుకుని మరీ పాడాడు. అయితే..కొన్ని పదాలను పలకడంలో ఇబ్బంది పడ్డాడు.






కానీ ఈ చిన్నోడు మాత్రం ఏదో ఒక పదంతో పాడేశాడు. అతని అమాయకత్వం, ఏకాగ్రత తనకు ఎంతగానో నచ్చిందని అన్నారు మహీంద్ర. నెటిజన్లు కూడ వండర్ ఫుల్, చిన్నారి దేశభక్తిని కొనియాడారు. ఇంకేముంది..ఇతరులకు షేర్ చేసేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు