ఓటు వేసిన అన్నా హజారే :ఈవీఎంలపై పార్టీ గుర్తు అవసరం లేదు

  • Publish Date - April 23, 2019 / 07:13 AM IST

మూడో దశ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని తన సొంత గ్రామమైన రాలెగావ్ సిద్ధిలో  ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలపై అభ్యర్థి పేరు, ఫొటో ఉంటే సరిపోతుందన్న ఆయన.. పార్టీ పేరు, గుర్తు అవసరం లేదన్నారు.

గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ సతీమణితో కలిసి నార్త్‌ గోవా జిల్లాలోని పాలె పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఒడిశాలోని తాల్చేర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఐఏఎస్‌ అధికారి భువనేశ్వర్‌ భాజపా అభ్యర్థి అపరిజిత సారంగి నగరంలోని గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూపీ మాజీ సీఎం సమాజ్ వాద్ పార్టీ గౌరవాధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ సైఫాయి, మెయిన్పురిలో పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ట్రెండింగ్ వార్తలు