Building Collapse : బెంగళూరులో కుప్పకూలిన మరో భవనం
బెంగళూరులో మరో భవనం కుప్పకూలింది. బెంగళూరు మిల్క్ యూనియన్ లిమిటెడ్ సిబ్బంది నివాసం ఉంటున్న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది.
- kunduru Vinod
- Published on- September 28, 2021 / 03:44 PM IST
Building Collapse
Building Collapse : బెంగళూరులో మరో భవనం కుప్పకూలింది. బెంగళూరు మిల్క్ యూనియన్ లిమిటెడ్ సిబ్బంది నివాసం ఉంటున్న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. మంగళవారం ఉదయం వేగంగా పగుళ్లు రావడంతో అందులోని వారు చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. ఇక అందులో నివసించే సుమారు 30 మంది తమ సామాను తీసుకోని బయటకు వచ్చేశారు. భవనం ఖాళీ అయిన కొద్దీ సేపటికే ఒక్కసారి కిందపడిపోయింది.
Read More : Building Collapse : చూస్తుండగానే కుప్పకూలిన భవనం.. వైరల్ వీడియో
దీంతో పక్కాభవనాలకు కూడా పగుళ్లు వచ్చాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. కాగా ఈ భవనం నిర్మించి 40 నుంచి 50 ఏళ్ళు అవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇక సోమవారం లక్కసంద్ర ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. భవనం ఒరిగి పోవడాన్ని ముందే గమనించిన నివాసితులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి భవనంలోని అందరిని ఖాళీ చేయించారు. భవనం ఖాళీ అయిన కొద్దీ సేపటికే కుప్పకూలింది.
Read More : Building Collapse:ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..శిథిలాల కింద ప్రాణాలు..!
