చెన్నైలో 5వేల మంది CAA వ్యతిరేకుల ఆందోళన.. 170మంది అరెస్టు

5వేలకు మందికి పైగా పాల్గొన్న CAA వ్యతిరేక ఆందోళనలో 170మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన చెన్నైలోని ఓల్డ్ వాషర్‌మెంట్‌పేట్‌లో జరిగింది. శుక్రవారం మింట్ బ్రిడ్జ్‌కు వెళ్లేదారిలోని వీధులన్నీ బ్లాక్ చేసి నిరసనకారులు ఆందోళన చేపట్టారు. వెయ్యి మందికి పైగా పోలీసులు వచ్చినప్పటికీ అదుపు చేయలేకపోయారు. 

పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు లాఠీ ఛార్జి చేశారు పోలీసులు. ‘మధ్యాహ్నం 2నుంచి 5గంటల సమయం మధ్యలో మూడు సార్లు లాఠీ ఛార్జి చేసి చెదరగొట్టారు. గాయాలు ఎక్కువ అయిన వారిని స్టాన్లీ గవర్నమెంట్ హాస్పిటల్‌కు, కొందరిని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్పించారు. సిటీలోని అలందర్, అన్నా సాలైలతో పాటు తమిళనాడు వ్యాప్తంగా మధురై, కొయంబత్తూరు ప్రాంతాలలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. 

ఆందోళనకారులు ఒక చోటుకు చేరకుండా పోలీసులు మింట్ బ్రిడ్జిను తాత్కాలికంగా క్లోజ్ చేశారు. ఈ విషయంలో వాషర్‌మెంట్‌పేట్‌లో అదుపుచేయలేక చిన్నపాటి గొడవ జరిగింది. మరిన్ని ఆందోళనలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో గురువారం తమిళనాడు సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 41ను ఫిబ్రవరి 13 నుంచి 22వరకూ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిని బట్టి ఆందోళనకారులు ఒక చోటుకు చేరితే హెచ్చరికలు జారీ చేయకుండానే వారిని చెదరగొడతారు. 

పోలీసులు అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంటే ఓ పెద్దాయన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయకుమారిపై దాడి చేశాడు. అతనిపై లాఠీ ఛార్జి చేయడంతో తీవ్రంగా గాయాలకు గురయ్యాడు. అతనిని వెంటనే స్టాన్లీ గవర్నమెంట్ లో చేర్పించి చికిత్స అందించారు. డిశ్చార్జ్ అయినప్పటికి కార్డియాక్ అరెస్ట్ తో  ఇంటి దగ్గరే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఇవన్నీ ఆందోళనకారులు చెప్పుకొస్తున్న పుకార్లని కొట్టిపారేస్తున్నారు. 

Read Here>>వైద్యం చేస్తున్న 1700 డాక్టర్లకీ కరోనావైరస్.. చైనాకొచ్చిన కొత్త కష్టం!