Cm Chandrababu: ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ.. గోదావరి పుష్కరాలపై చర్చ.. నిధుల కోసం విజ్ఞప్తి!

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(Cm Chandrababu) ప్రధాని మోడీతో కీలక భేటీ నిర్వహించారు.

AP CM Chandrababu meet with Prime Minister Modi.

Cm Chandrababu: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత కీలక భేటీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసమైన 7 లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ఇరువురు అగ్రనేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అందవలసిన ఆర్థిక సహకారంపై ప్రధానితో చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా భారీగా నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు గట్టిగా కోరినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలోని తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణాది నదుల అనుసంధాన ప్రాజెక్టును త్వరగా చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

Garuda Map App: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ‘గరుడ మ్యాప్’ యాప్.. ఇక ఎక్కడికైనా ఈజీగా వెళ్లొచ్చు!

కేంద్ర మంత్రులతోనూ చంద్రబాబు వరుస భేటీలు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కీలక చర్చలు:

ప్రధాని మోడీతో సమావేశానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) కేంద్ర కేబినెట్ మంత్రులు నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్‌తో విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణాలు, రవాణా రంగానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనపై కేంద్ర మంత్రులతో చర్చించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఏపీలో నూతన రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతం, వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్ర పెద్దలకు విన్నవించారు. డిల్లీ వేదికగా సీఎం చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తుండటం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుదలగా ప్రయత్నిస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.