Star Mark On RS 500 Notes : 500 రూపాయల నోట్ల పై నక్షత్రం గుర్తు.. అవి నకిలీవా..? నిజమెంత..?
రూ.500 నోటు పై స్టార్(నక్షత్రం) గుర్తు ఉంటే ఆ నోటు నకిలీవి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- January 19, 2024 / 08:23 PM IST
RS 500 Notes With the Star Symbol
ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ ఏమీ జరిగినా కానీ సోషల్ మీడియా వల్ల క్షణాల్లో ఆ వార్త తెలిసిపోతుంది. అయితే.. సోషల్ మీడియాలో వచ్చేవి అన్నీ నిజాలు అనుకుంటే పొరబడినట్లే. తప్పుడు వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రూ.500 నోటు పై స్టార్(నక్షత్రం) గుర్తు ఉంటే ఆ నోటు నకిలీవి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘స్టార్ గుర్తుతో ఉన్న 500 నోట్లు గత రెండు మూడు రోజుల నుంచి మార్కెట్లో చెలామణి అవ్వడం ప్రారంభించాయి. అలాంటి ఓ నోటు నిన్న ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి వచ్చింది. ఇది నకిలీ నోటు. ఈ రోజు కూడా ఒక స్నేహితుడు ఒక కస్టమర్ నుంచి అలాంటి నోట్లను రెండు లేదా మూడు అందుకున్నాడు. ఈ విషయం పై అతడికి అవగాహన లేదు. తనకు ఎవరో ఇచ్చారని చెప్పారు. దీనిపై మీరు జాగ్రత్తగా ఉండండి. మార్కెట్లో నకిలీ నోట్ల సంఖ్య పెరిగింది. కాబట్టి ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ మంది సోదరులకు ఈ సందేశాన్ని చేరవేయండి. తద్వారా వారు ఈ నకిలీ నోట్ల వల్ల మోసపోకుండా ఉంటారు. వీటిని ఎవరూ తీసుకోవద్దు.’ అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Ayodhya Ram Mandir : అయోధ్యలో ప్రాణప్రతిష్టకు ముందే బాల రాముడి దర్శనం
ఏదీ నిజం..
ఈ విషయం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా దృష్టికి వెళ్లింది. దీనిపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది. అలాంటి వార్తలను నమ్మొద్దు అని సూచించింది. నక్షత్రం గుర్తు ఉన్న నోట్లు కూడా నిజమైనవేనని చెప్పింది. అవి కూడా చలామణిలో ఉన్నాయని తెలిపింది.
మరీ నక్షత్రం గుర్తు ఎందుకు ఉన్నట్లు..?
నక్షత్రం గుర్తు అనేది ఒక ఐడెంటిఫైయర్. అంటే.. భర్తీ చేయబడిన లేదా పునఃముద్రించబడిన నోటు అని దీని అర్థం. ఇలా ఎందుకంటే.. వాస్తవానికి ఇలాంటి నోట్లను తొలుత ముద్రించినప్పుడు ఏదో ఒక లోపం ఉంటుంది. ఆతరువాత దాన్ని సరిచేసి నక్షత్రం గుర్తుతో కొత్త నోటుతో ముద్రిస్తారు. నంబర్ ప్యానెల్లో ప్రిఫిక్స్, క్రమ సంఖ్య మధ్య నక్షత్రం గుర్తు జోడిస్తారు.
Viral Video : సివిల్ సర్వీసులకు సిద్ధమవుతున్నవిద్యార్థి గుండెపోటుతో మృతి.. కోచింగ్ క్లాస్లో..
2006 సంవత్సరంలో ఇలాంటి స్టార్ గుర్తు ఉన్న నోట్లను తొలిసారిగా ఆర్బీఐ ముద్రించింది. మొదటగా రూ.10, 20, 50, 100 నోట్లపై ముద్రించారు. 2016 డిసెంబర్ నుంచి రూ.500 నోట్లపై నక్షత్రం గుర్తును ముద్రిస్తున్నారు.
