Viral Video : సివిల్‌ సర్వీసులకు సిద్ధమవుతున్నవిద్యార్థి గుండెపోటుతో మృతి.. కోచింగ్ క్లాస్‌లో..

ఇటీవ‌ల కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా ప‌లువురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లు అధికం అవుతున్నాయి.

Viral Video : సివిల్‌ సర్వీసులకు సిద్ధమవుతున్నవిద్యార్థి గుండెపోటుతో మృతి.. కోచింగ్ క్లాస్‌లో..

Indore Student preparing for civil services collapses in coaching class and dies

Updated On : January 18, 2024 / 3:47 PM IST

Video : ఇటీవ‌ల కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా ప‌లువురు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లు అధికం అవుతున్నాయి. గ‌తంలో 50 ఏళ్లు దాటిన వారిలో మాత్ర‌మే గుండెసంబంధిత స‌మ‌స్య‌లు క‌నిపించేవి. అయితే.. ప్ర‌స్తుతం 30 ఏళ్ల లోపు యువ‌త కూడా గుండెపోటుకు గురై మ‌ర‌ణిస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కు వీరంతా ఎంతో ఉత్సాహంగా ఉన్న‌ప్ప‌టికీ క్ష‌ణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.

మెట్లు ఎక్కుతూ, రోడ్డుపై న‌డుచుకుంటూ వెలుతూ, శుభ‌కార్యాల్లో డ్యాన్స్‌లు చేస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఇలా ఏదో ఒక ప‌ని చేస్తూనే హ‌ఠాత్తుగా కుప్ప‌కూలిపోతున్నారు. తాజాగా కోచింగ్ సెంట‌ర్‌లో పాఠాలు వింటున్న ఓ విద్యార్థి ప్రాణాలు గుండెపోటుతో మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఇండోర్ న‌గ‌రంలో చోటు చేసుకుంది.

Viral Video : దొంగకి దిమ్మ తిరిగింది.. ఫోన్ కొట్టేద్దామని ట్రైన్ విండోలో చెయ్యి పెట్టి…

వివ‌రాల్లోకి వెళితే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువ‌కుడు రాజా లోధి మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) ప‌రీక్ష కోసం స‌న్న‌ద్ధం అవుతున్నాడు. కోచింగ్ నిమిత్తం భ‌వార్‌కువాలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాడు. రోజులాగే గురువారం ఉద‌యం కూడా అత‌డు కోచింగ్‌కు హాజ‌రు అయ్యాడు. న‌ల్ల‌చొక్కా ధ‌రించిన అత‌డు మిగిలిన విద్యార్థుల మ‌ధ్య‌లో కూర్చోని ఉన్నారు.

లోధి నిటారుగా కూర్చోని ప్రొఫెస‌ర్ చెబుతున్న పాఠాల‌పై దృష్టి పెట్టాడు. అయితే.. ఆక‌స్మాత్తుగా త‌న ఛాతిలో విప‌రీత‌మైన నొప్పి క‌ల‌గ‌డంతో త‌న ఛాతీని ప‌ట్టుకున్నాడు. కొన్ని క్ష‌ణాల్లోనే అత‌డు తాను కూర్చున్న కుర్చీ నుంచి కింద‌ప‌డిపోయాడు. ప‌క్క‌నున్న‌ విద్యార్థులు వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న మొత్తం అక్క‌డి క్లాస్ రూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇది ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.