Viral Video : దొంగకి దిమ్మ తిరిగింది.. ఫోన్ కొట్టేద్దామని ట్రైన్ విండోలో చెయ్యి పెట్టి…

ఓ దొంగకి చావు తప్పి కన్ను లొట్టపోయింది.. కదులుతున్న ట్రైన్ విండోలోంచి ప్యాసింజర్ చేతిలో సెల్ ఫోన్ కొట్టేయాలని ప్రయత్నం చేసాడు. దెబ్బకి దిమ్మ తిరిగింది.

Viral Video : దొంగకి దిమ్మ తిరిగింది.. ఫోన్ కొట్టేద్దామని ట్రైన్ విండోలో చెయ్యి పెట్టి…

Viral Video

Updated On : January 18, 2024 / 2:51 PM IST

Viral Video : కదులుతున్న ట్రైన్‌లో సెల్ ఫోన్ కొట్టేద్దామనుకున్నాడు. కంపార్ట్‌మెంట్‌లో ప్యాసింజర్ అలెర్టై దొంగ చేతిని పట్టుకున్నాడు. ఇంకేముందు? అలాగే ఒక కిలోమీటర్ వరకు ఆ దొంగను ట్రైన్ ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగింది? అంటే..

Rajasthan : మహిళను 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. రక్షించడానికి పరుగులు తీసిన జనం.. వైరల్ వీడియో

ఎలా దొంగతనం చేయాలా? అని దొంగలు కాపు కాచుకుని చూస్తుంటారు. కదులుతున్న ట్రైన్ టార్గెట్‌గా ప్యాసింజర్ చేతిలో సెల్ ఫోన్ కొట్టేయాలని ఓ దొంగ డిసైడ్ అయ్యాడు. అది కాస్త విఫలమై ప్రయాణికుడు చేయి గట్టిగా పట్టుకోవడంతో రైలు ఆ దొంగని ఒక కిలోమీటరు ఈడ్చుకెళ్లింది. ఆ సమయంలో ఏ ప్రమాదం జరగకపోవడంతో దొంగ ప్రాణాలతో బయటపడ్డాడు.  బీహార్‌లో బాగల్‌పూర్ సమీపంలోని కాలేష్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇతర ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : సెలూన్‌కి వచ్చిన కస్టమర్‌ని చితకబాదిన బార్బర్.. వైరల్ వీడియోపై ప్రజలు ఆగ్రహం
ప్రయాణికుడి చేతిలో ఫోన్ లాక్కోవాలని ప్రయత్నించడం.. ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకుని విడివకపోవడం.. దొంగ విడిపించుకునే ప్రయత్నం చేయడం.. అంతలో కొందరు అతనిని కాపాడటానికి రావడం వీడియోలో మనకు కనిపించింది. గతంలో కూడా బీహార్‌లో ఇలాంటిదే సంఘటన జరిగింది. సాహెబ్‌పూర్ కమల్‌ స్టేషన్‌లో దొంగ ఇలాగే సెల్ ఫోన్ చోరీ చేయాలని ప్రయత్నించగా ప్రయాణికులు 10 కిలోమీటర్ల వరకు అతని చేయి విడిచిపెట్టలేదు. విండో సీట్లో కూర్చున్నప్పుడు ప్రయాణికులు కాస్త అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి సంఘటనలు చెబుతున్నాయి.