Viral Video
Viral Video : కదులుతున్న ట్రైన్‌లో సెల్ ఫోన్ కొట్టేద్దామనుకున్నాడు. కంపార్ట్‌మెంట్‌లో ప్యాసింజర్ అలెర్టై దొంగ చేతిని పట్టుకున్నాడు. ఇంకేముందు? అలాగే ఒక కిలోమీటర్ వరకు ఆ దొంగను ట్రైన్ ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగింది? అంటే..
ఎలా దొంగతనం చేయాలా? అని దొంగలు కాపు కాచుకుని చూస్తుంటారు. కదులుతున్న ట్రైన్ టార్గెట్‌గా ప్యాసింజర్ చేతిలో సెల్ ఫోన్ కొట్టేయాలని ఓ దొంగ డిసైడ్ అయ్యాడు. అది కాస్త విఫలమై ప్రయాణికుడు చేయి గట్టిగా పట్టుకోవడంతో రైలు ఆ దొంగని ఒక కిలోమీటరు ఈడ్చుకెళ్లింది. ఆ సమయంలో ఏ ప్రమాదం జరగకపోవడంతో దొంగ ప్రాణాలతో బయటపడ్డాడు. బీహార్‌లో బాగల్‌పూర్ సమీపంలోని కాలేష్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇతర ప్రయాణికులు ఈ ఘటనను వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video : సెలూన్‌కి వచ్చిన కస్టమర్‌ని చితకబాదిన బార్బర్.. వైరల్ వీడియోపై ప్రజలు ఆగ్రహం
ప్రయాణికుడి చేతిలో ఫోన్ లాక్కోవాలని ప్రయత్నించడం.. ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకుని విడివకపోవడం.. దొంగ విడిపించుకునే ప్రయత్నం చేయడం.. అంతలో కొందరు అతనిని కాపాడటానికి రావడం వీడియోలో మనకు కనిపించింది. గతంలో కూడా బీహార్‌లో ఇలాంటిదే సంఘటన జరిగింది. సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్‌లో దొంగ ఇలాగే సెల్ ఫోన్ చోరీ చేయాలని ప్రయత్నించగా ప్రయాణికులు 10 కిలోమీటర్ల వరకు అతని చేయి విడిచిపెట్టలేదు. విండో సీట్లో కూర్చున్నప్పుడు ప్రయాణికులు కాస్త అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి సంఘటనలు చెబుతున్నాయి.
Kalesh near Bhagalpur Bihar, a snatcher was snatching a passenger’s phone from a moving train, but he could not succeed in it and the passenger caught the snatcher and carried him hanging for about a kilometer
pic.twitter.com/66wIJmzWjS— Ghar Ke Kalesh (@gharkekalesh) January 17, 2024