Viral Video : సెలూన్‌కి వచ్చిన కస్టమర్‌ని చితకబాదిన బార్బర్.. వైరల్ వీడియోపై ప్రజలు ఆగ్రహం

రీల్స్ పిచ్చిలో చేస్తున్నారో? నిజంగానే సహనం కోల్పోతున్నారో తెలియదు కానీ.. సెలూన్‌కి వచ్చిన వ్యక్తిని చితక బాదాడు ఓ బార్బర్. వైరల్ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video : సెలూన్‌కి వచ్చిన కస్టమర్‌ని చితకబాదిన బార్బర్.. వైరల్ వీడియోపై ప్రజలు ఆగ్రహం

viral video

Viral Video : హెయిర్ కట్ కోసం ఓ వ్యక్తి సెలూన్‌కి వెళ్లాడు. అతనిపై అకస్మాత్తుగా బార్బర్ చెప్పుతో దాడి చేస్తే? అలాంటి ఘటనకి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Alex Carey : బార్బర్‌కు డ‌బ్బులు ఎగ్గొట్టిన ఆసీస్ కీప‌ర్‌.. జూలై 10లోపు ఇవ్వ‌కుంటే..!

viralbhayani అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సెలూన్‌లో హెయిర్ కట్టింగ్ కోసం వచ్చిన కస్టమర్ జుట్టుకి బార్బర్ షాంపూ పూసి, చెంప దెబ్బ కొట్టాడు. చుట్టూ ఉన్నవారంతా అది చూసి షాకయ్యారు. మరొకరు అతనికి చెప్పు అందించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ చెప్పు అందుకున్న బార్బర్ కస్టమర్‌ను చెప్పుతో కొట్టడం ప్రారంభించాడు. కారణం లేకుండా బార్బర్ తనను కొట్టడంతో ఆ కస్టమర్ అయోమయంలో ఉండిపోయాడు. తన చేతిలో ఉన్న చెప్పుని పక్క సీటులో కూర్చున్న యువకుడిపైకి విసిరాడు. విపరీతంగా ప్రవర్తించిన అతడిని చూసి అక్కడ ఉన్నవాళ్లంతా పరుగులు తీశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Taliban Ban : అప్ఘానిస్థాన్‌లో మహిళా బ్యూటీ సెలూన్లపై తాలిబన్ల నిషేధాస్త్రం

ఈ వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు. ‘ఇది ఎంత అవమానకరం? తమాషా కాదు.. ఇది ఎంతో బాధించేది’ అని.. ‘నాన్సెన్స్ రీల్స్ కోసం ఓ అమాయకుడిని కొట్టడం సరికాదు’ అంటూ కామెంట్లు పెట్టారు. ఇదంతా కావాలని చేశారో? లేక నిజంగానే కస్టమర్ దెబ్బలు తిన్నాడో తెలియదు కానీ ఇలాంటి పనులు చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)