Alex Carey : బార్బర్‌కు డ‌బ్బులు ఎగ్గొట్టిన ఆసీస్ కీప‌ర్‌.. జూలై 10లోపు ఇవ్వ‌కుంటే..!

యాషెస్(Ashes) సిరీస్‌లో ఆస్ట్రేలియా(Australia) జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

Alex Carey : బార్బర్‌కు డ‌బ్బులు ఎగ్గొట్టిన ఆసీస్ కీప‌ర్‌.. జూలై 10లోపు ఇవ్వ‌కుంటే..!

Leeds Barber Gives Alex Carey Deadline

Leeds Barber Gives Alex Carey Deadline : యాషెస్(Ashes) సిరీస్‌లో ఆస్ట్రేలియా(Australia) జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొన‌సాగుతోంది. లీడ్స్‌లో జ‌రుగుతున్న మూడో టెస్టు మూడో రోజుకు ఆట‌కు వ‌రుణుడు అడ్డు ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 116 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ 17, ట్రావిస్ హెడ్ 18 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. రెండో టెస్టులో ఆసీస్‌ జ‌ట్టు క్రీడా స్ఫూర్తి పై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. వికెట్ కీప‌ర్ అలెక్స్ క్యారీ(Alex Carey) జానీ బెయిర్‌స్టో(Jonny Bairstow)ను స్టంపౌట్ చేసిన విదానంపై ఇంకా విమ‌ర్శ‌ల జ‌డివాన కొన‌సాగుతూనే ఉంది. మూడో టెస్టులో ఇంగ్లాండ్ అభిమానులు అలెక్స్ క్యారీని టార్గెట్ చేసి గేలి చేశారు. ఆడింది చాలు ఇక వెళ్లు అంటూ చెప్పులు, షూలు చూపించారు. కాగా.. మ‌రోసారి క్యారీ వార్త‌ల్లో నిలిచాడు. ఈ సారి బార్చ‌ర్ కు డ‌బ్బులు ఎగ్గొట్టాడట‌.

Ashes 2023 : టెస్టుల్లో 10వ సారి జో రూట్ ను ఔట్ చేసిన క‌మిన్స్‌.. ఆసీస్‌కు స్వ‌ల్ప ఆధిక్యం

లీడ్స్‌లోని ఓ క‌టింగ్‌కు వెళ్లాడు అలెక్స్ క్యారీ. ఆడం మ‌హ‌మూద్ అనే బార్బ‌ర్ వ‌ద్ద క‌టింగ్ చేయించుకున్నాడు. 30 యూరోలు అంటే మ‌న క‌రెన్సీలో రూ.2,718 అయింది. ప్ర‌స్తుతం త‌న వ‌ద్ద అంత న‌గ‌దు లేద‌ని చెప్పాడు. త‌ప్ప‌కుండా ఇచ్చేస్తాన‌ని చెప్ప‌డంతో అత‌డు వెళ్లేందుకు ఆడం అడ్డుచెప్ప‌లేదు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని ఆడం ఆరోపిస్తున్నాడు. అంతేనా అలెక్స్ క్యారీకి డెడ్ లైన్ కూడా విధించాడు. జూలై 10లోగా డ‌బ్బులు పంపితే సంతోషిస్తానని లేదంటే త‌న ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌స్తుంద‌ని చెప్పాడు. మ‌రీ అలెక్స్ క్యారీ ఏం చేయ‌నున్నాడో చూడాల్సిందే. ఇందులో ఎంత నిజం ఉన్న‌ది అన్న‌ది అలెక్స్ క్యారీ స్పందిస్తేనే తెలుస్తుంది.

MS Dhoni Birthday Celebrations : మ‌నుషుల‌కు దూరంగా ధోని బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌.. వీడియో వైర‌ల్‌