Ashes 2023 : టెస్టుల్లో 10వ సారి జో రూట్ ను ఔట్ చేసిన క‌మిన్స్‌.. ఆసీస్‌కు స్వ‌ల్ప ఆధిక్యం

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా(Australia), ఇంగ్లాండ్ (England)జ‌ట్ల మ‌ధ్య లీడ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది.

Ashes 2023 : టెస్టుల్లో 10వ సారి జో రూట్ ను ఔట్ చేసిన క‌మిన్స్‌.. ఆసీస్‌కు స్వ‌ల్ప ఆధిక్యం

Joe Root vs Pat Cummins

Ashes 2023 Eng vs Aus : యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా(Australia), ఇంగ్లాండ్ (England)జ‌ట్ల మ‌ధ్య లీడ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 237 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. దీంతో ఆసీస్‌కు 26 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్‌(80; 108 బంతుల్లో 6 ఫోర్లు, 5సిక్స‌ర్లు) ఒక్క‌డే ఒంటరి పోరాటం చేశాడు. పాట్ క‌మిన్స్ (Pat Cummins) ఆరు వికెట్ల‌తో ఇంగ్లాండ్ ప‌త‌నాన్ని శాసించాడు. మిచెల్ స్టార్క్‌ రెండు, టాడ్‌ మర్ఫీ, మిచెల్‌ మార్ష్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఓవ‌ర్ నైట్ స్కోరు మూడు వికెట్ల న‌ష్టానికి 68 ప‌రుగుల‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ మ‌రో 169 ప‌రుగులు జోడించి మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. ఆట ఆరంభ‌మైన కాసేప‌టికే రూట్ ఔట్ అయ్యాడు. క‌మిన్స్ బుట్ట‌లో రూట్ ప‌డిపోయాడు. టెస్టుల్లో రూట్‌ను కమిన్స్ ఔట్ చేయ‌డం ఇది 10వ సారి. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి మ‌రో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ స్టోక్స్ మాత్రం త‌న‌దైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.

MS Dhoni long hair : నాటి పాకిస్తాన్ అధ్య‌క్షుడు మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ధోని ఎందుకు మార్చాడు..?

మొద‌ట ఆచితూచి ఆడిన స్టోక్స్ ఆత‌రువాత వేగం పెంచాడు. మొద‌టి 69 బంతుల్లో 29 ప‌రుగులు మాత్ర‌మే స్టోక్స్ ఆ త‌రువాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 ప‌రుగులు చేశాడు. స్టోక్స్ విజృంభ‌ణ‌తో ఆసీస్‌కు స్వ‌ల్ప ఆధిక్యం మాత్ర‌మే ద‌క్కింది.

టెస్టుల్లో జో రూట్‌ను 10వ సారి ఔట్ చేసిన క‌మిన్స్‌

మొద‌టి ఇన్నింగ్స్‌లో జో రూట్ 45 బంతులు ఎదుర్కొని 2 ఫోర్ల‌తో 19 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. మొద‌టి రోజు అజేయంగా నిలిచిన రూట్ రెండో రోజు ఆట ప్రారంభ‌మైన కాసేప‌టికే ఔట్ అయ్యాడు. క‌మిన్స్ బౌలింగ్‌లో వార్న‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అధునిక టెస్టు క్రికెట్‌లో అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో రూట్ ఒక‌డిగా పేరుగాంచాడు. అయితే.. ఎంద‌రో బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనే అత‌డు క‌మిన్స్ బౌలింగ్‌లో బాగా ఇబ్బంది ప‌డుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌మిన్స్ బౌలింగ్‌లో 472 బంతులు ఎదుర్కొని 226 ప‌రుగులు చేశాడు. ఇందులో 24 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. 356 డాట్ బాల్స్ ఉండ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో 10 సార్లు క‌మిన్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

ICC World Cup 2023 : ప్ర‌పంచ‌కప్‌లో పాల్గొనే జ‌ట్లు ఇవే.. టీమిండియా ఆడే మ్యాచ్‌ల అప్‌డేట్‌ షెడ్యూల్..