Rajasthan : మహిళను 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. రక్షించడానికి పరుగులు తీసిన జనం.. వైరల్ వీడియో

రాజస్థాన్‌లో ఓ కారు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఓ మహిళను కారుతో ఈడ్చుకెళ్లాడు. ఆమెను రక్షించడానికి అనేకమంది పరుగులు తీసినా ఆ డ్రైవర్ కారు ఆపలేదు. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

Rajasthan : మహిళను 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. రక్షించడానికి పరుగులు తీసిన జనం.. వైరల్ వీడియో

Rajasthan

Rajasthan : రాజస్థాన్ లో ఓ కారు డ్రైవర్ మహిళను కారు బానెట్ పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Modi vs Gehlot: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‭కు బిగిస్తున్న ఎర్ర డైరీ ఉచ్చు.. ప్రధాని మోదీ కూడా ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు

హనుమాన్‌గఢ్ మెయిన్ బస్టాండ్ సమీపంలో ఓ కారు డ్రైవర్ మహిళను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన సంఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. 500 మీటర్ల దూరం వరకూ డ్రైవర్ ఆమెను ఈడ్చుకెళ్లాడు. చాలామంది ఆమెను కాపాడటానికి వెనుక పరుగులు తీసారు. అయినా డ్రైవర్ కారు ఆపలేదు. సీసీ టీవీలో రికార్డైన విజువల్స్ ఆధారంగా ఇది రావ్లాకు చెందిన వ్యక్తి కారుగా పోలీసులు గుర్తించారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డ్ అయ్యింది. మహిళ, కారు డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Rajasthan DSP : దళితుడిపై మూత్రం పోసి .. ఎమ్మెల్యే బూట్లు నాకించిన రాజస్థాన్‌ డీఎస్పీ

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మాజీ కేంద్ర మంత్రి , బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తన ట్విట్టర్ అకౌంట్లో (Col Rajyavardhan Rathore) షేర్ చేశారు. ‘రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘఢ్‌లో పట్టపగలు ఓ మహిళను కారు బానెట్‌పై దుండగులు లాక్కెళ్తున్నారు. గెహ్లాట్ జీ, మీ పరిపాలనలో మహిళలపై ప్రతిరోజు ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్న విషయం మీకు తెలుస్తోందా?’ అనే శీర్షికతో పోస్టు చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.