Modi vs Gehlot: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు బిగిస్తున్న ఎర్ర డైరీ ఉచ్చు.. ప్రధాని మోదీ కూడా ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు
ఎర్ర డైరీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ రాబోయే రోజుల్లో ప్రధానికి ఎర్ర జెండా చూపిస్తారని అన్నారు. ప్రధాని మోదీ, ఆయన పార్టీ నేతలు తమను చూసి భయపడుతున్నారని, రాజేంద్ర గూడాను బలిపశువుగా మార్చారని అన్నారు.

Rajasthan Politics: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు విపక్షాల కంటే స్వపక్షం నుంచే ఎక్కువ సవాళ్లు ఎదురవుతున్నాయి. నిన్నటి వరకు మాజీ డిప్యూటీ సచిన్ పైలట్‌తో హోరాహోరీ కొనసాగింది. ఇది సద్ధుమనిగిందో లేదో ప్రభుత్వంలోని మరో మంత్రి ఆయనపై తిరుగుబాటుకు దిగారు. అనంతరం, ఒక ఎర్ర డైరీని అసెంబ్లీకి తీసుకువచ్చి, అందులో గెహ్లాట్ అవినీతి చిట్టా ఉందంటూ బయటపెట్టారు. ఈ వివాదంతో తలమునకలవుతున్న గెహ్లాట్ ను మరింత ఇరుకునే పెట్టారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.
Brazil : సెల్ ఫోన్‌తో పాటు ఆమె మనసు దోచుకున్న దొంగ.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ప్రేమ కథ
గురువారం రాష్ట్రంలో సికార్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ‘ఎర్ర డైరీ’ కేసును ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ చీకటి రహస్యాలను ఎర్ర డైరీలో ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ‘ఎర్ర డైరీ’లో కాంగ్రెస్ ప్రభుత్వ చీకటి పనులకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని, ఆ డైరీ పేజీలు తెరిస్తే అనేక ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు చెబుతున్నారని ఆయన అన్నారు.
“ఈ ఎర్ర డైరీ ప్రస్తావన కాంగ్రెస్‌లోని పెద్ద పెద్ద నాయకులను కూడా మౌనంలోకి నెట్టివేసింది. అయితే వారు మౌనంగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎర్ర డైరీ పెద్ద దెబ్బగా మారనుంది. ఎర్ర డైరీ అనేది కాంగ్రెస్ అవినీతి చిట్టా’’ అని ప్రధాని అన్నారు. ఇంకా, రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటున్నదని ధ్వజమెత్తారు. “రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలను నీటి కోసం ఆరాటపడేలా చేయాలనుకుంటోంది. ఈ రోజు రాజస్థాన్‌లో ఒకే స్వరం, ఒకే నినాదం, కమలం గెలుస్తుంది, కమలం వికసిస్తుంది” అని అన్నారు. ” అని సికార్‌లో ప్రధాని మోదీ అన్నారు.
CM Jagan : జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల.. రూ.45 కోట్ల 53 లక్షలు జమ చేసిన సీఎం జగన్
అయితే ఎర్ర డైరీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ రాబోయే రోజుల్లో ప్రధానికి ఎర్ర జెండా చూపిస్తారని అన్నారు. ప్రధాని మోదీ, ఆయన పార్టీ నేతలు తమను చూసి భయపడుతున్నారని, రాజేంద్ర గూడాను బలిపశువుగా మార్చారని అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భయాందోళనకు గురిచేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ చెప్పిన ఎర్ర డైరీ కథ కల్పితమని అన్నారు. దేశంలో ఇంధన ధరలను ప్రస్తావిస్తూ ఎరుపు రంగు సిలిండర్ గురించి మాట్లాడాలని గెహ్లాట్ విమర్శలు గుప్పించారు.