Karnataka : గాల్లోకి ఎగిరిన బైక్.. విద్యార్ధినులను ఢీకొట్టిన కారు.. వైరల్ అవుతున్న కర్ణాటక రోడ్డు ప్రమాద ఘటన

అతి వేగంతో వచ్చిన కారు ఓ బైక్‌ను, విద్యార్ధినులను ఢీ కొట్టిన ఘటన కర్ణాటకలో జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ ప్రమాద ఘటన వీడియో వైరల్ అవుతోంది.

Karnataka : గాల్లోకి ఎగిరిన బైక్.. విద్యార్ధినులను ఢీకొట్టిన కారు.. వైరల్ అవుతున్న కర్ణాటక రోడ్డు ప్రమాద ఘటన

Karnataka

Updated On : July 27, 2023 / 1:33 PM IST

Karnataka : కర్ణాటకలో దూసుకొచ్చిన కారు బైకర్‌ను, ఇద్దరు స్టూడెంట్స్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకర్‌తో పాటు.. ఇద్దరు విద్యార్ధినులకు గాయాలయ్యాయి.

Cargo Ship: కార్గో నౌక‌లో భారీ అగ్నిప్రమాదం.. మూడువేల కార్లు బుగ్గి.. సిబ్బంది ఎలా ప్రాణాలు దక్కించుకున్నారంటే?

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో అతి వేగంగా వెళ్లున్న కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్ధినులను ఢీ కొట్టిన ఘటన సీసీ టీవీలో రికార్డైంది. @DeshmukhHarish9 అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. రాఘవేంద్ర పెట్రోల్ బంకు సమీపంలో జూలై 18 న ఈ ఘటన జరిగింది.

Tourist Bus Accident : ఒంగోలులో పొలంలోకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు.. తిరుమల వెళ్తుండగా ప్రమాదం
ఎదురుగా వస్తున్న ట్రాఫిక్‌ను పట్టించుకోకుండా బైకర్ రద్దీగా ఉండే రోడ్డులో సడెన్‌గా యూ టర్న్ తీసుకోవడంతో ప్రమాదం జరిగింది. కారు ఢీ కొట్టగానే బైక్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది.  రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు విద్యార్ధినులను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకర్‌కి తీవ్ర గాయాలు కాగా, విద్యార్థినులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాయచూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదైంది.