Tourist Bus Accident : ఒంగోలులో పొలంలోకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు.. తిరుమల వెళ్తుండగా ప్రమాదం
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సుక్షితంగా బయటపడ్డారు.

road accident (13) (1)
Ongole Road Accident : ప్రకాశం జిల్లా ఒంగోలులో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల వెళ్తోన్న టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైంది. టూరిస్టు బస్సు పొలంలోకి దూసుకెళ్లింది. కొమరోలు పట్టణ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి టూరిస్టులు వెళ్తోన్న బస్సు ప్రమాదానికి గురైంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి తిరుమలకు వెళ్తున్న టూరిస్టు బస్సు మార్గంమధ్యలో ప్రకాశం జిల్లాలోని కొమరోలు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి బస్సు పొలంలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సుక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో టూరిస్టులకు పెను ప్రమాదం తప్పింది.