Cargo Ship: కార్గో నౌక‌లో భారీ అగ్నిప్రమాదం.. మూడువేల కార్లు బుగ్గి.. సిబ్బంది ఎలా ప్రాణాలు దక్కించుకున్నారంటే?

నెదర్లాండ్స్ లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్‌లో అగ్నిప్రమాదంలో ఒక భారతీయుడు మరణించినట్లు తెలిపింది.

Cargo Ship: కార్గో నౌక‌లో భారీ అగ్నిప్రమాదం.. మూడువేల కార్లు బుగ్గి.. సిబ్బంది ఎలా  ప్రాణాలు దక్కించుకున్నారంటే?

Cargo Ship

Heavy Fire In Cargo Ship : నెదర్లాండ్స్‌కు చెందిన సరుకు రవాణాచేసే కార్గో నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నౌకలో మూడు వేల కార్లు ఉన్నాయి. నార్త్ సీ (అట్లాంటిక్ సముద్రంలో భాగం) వెళ్తున్న ఈ నౌకలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సిబ్బంది ప్రాణాలు దక్కించుకొనేందుకు సముద్రంలోకి దూకారు. ఈ క్రమంలో ఒక భారతీయ సిబ్బంది మరణించగా.. 20 మంది గాయపడ్డారు. డచ్ కోస్ట్‌గార్డ్‌లు మంటలు చాలా రోజులపాటు కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు. జర్మనీలోని బ్రెమెన్ పోర్టు నుంచి ఈజిప్ట్ కు వెళ్తున్న ఫ్రెమాంటిల్ హైవే నౌక దాదాపు 3వేల కార్లతో వెళ్తుంది. మంగళవారం రాత్రి నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చాలా మంది సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.

Niger President Removed: ఆఫ్రికా దేశం నైజర్‌లో సైన్యం తిరుగుబాటు! అధ్యక్ష స్థానం నుంచి బజౌమ్ తొలగింపు

నెదర్లాండ్స్ లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్‌లో అగ్నిప్రమాదంలో ఒక భారతీయుడు మరణించినట్లు తెలిపింది. మరణించిన వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడంలో సహకరిస్తున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. ఎంబసీ మిగిలిన 20 మంది గాయపడిన సిబ్బందితో కూడా సంప్రదింపులు జరుపుతోంది. వారు సురక్షితంగా ఉన్నారని, వైద్య సహాయం పొందుతున్నారని, డచ్ అధికారులు, షిప్పింగ్ కంపెనీతో సమన్వయంతో సాధ్యమైన అన్ని సహాయాలు అందించబడుతున్నాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

Secunderabad Fire Accident : సికింద్రాబాద్ పాలికాబజార్ లో భారీ అగ్నిప్రమాదం

ఇదిలాఉంటే.. అగ్నిప్రమాదం సమయంలో నీటిలో దూకిన తరువాత 23 మంది సిబ్బందిని నౌక నుంచి దింపేందుకు రెస్క్యూ బోట్లు, హెలికాప్టర్ల ను ఉపయోగించినట్లు డచ్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. కార్గో షిప్ లో మంటలు చెలరేగిన 16 గంటల తరువాత కూడా మంటలను ఆర్పడానికి డచ్ అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని డచ్ కోస్ట్‌గార్డ్ చెప్పారు. మంటలు పూర్తిగా నియంత్రణలోకి రావడానికి రోజులు, వారాల సమయంకూడా పట్టవచ్చునని తెలిపారు.