Rajasthan
Rajasthan : రాజస్థాన్ లో ఓ కారు డ్రైవర్ మహిళను కారు బానెట్ పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
హనుమాన్‌గఢ్ మెయిన్ బస్టాండ్ సమీపంలో ఓ కారు డ్రైవర్ మహిళను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన సంఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. 500 మీటర్ల దూరం వరకూ డ్రైవర్ ఆమెను ఈడ్చుకెళ్లాడు. చాలామంది ఆమెను కాపాడటానికి వెనుక పరుగులు తీసారు. అయినా డ్రైవర్ కారు ఆపలేదు. సీసీ టీవీలో రికార్డైన విజువల్స్ ఆధారంగా ఇది రావ్లాకు చెందిన వ్యక్తి కారుగా పోలీసులు గుర్తించారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డ్ అయ్యింది. మహిళ, కారు డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Rajasthan DSP : దళితుడిపై మూత్రం పోసి .. ఎమ్మెల్యే బూట్లు నాకించిన రాజస్థాన్ డీఎస్పీ
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మాజీ కేంద్ర మంత్రి , బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తన ట్విట్టర్ అకౌంట్లో (Col Rajyavardhan Rathore) షేర్ చేశారు. ‘రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘఢ్‌లో పట్టపగలు ఓ మహిళను కారు బానెట్‌పై దుండగులు లాక్కెళ్తున్నారు. గెహ్లాట్ జీ, మీ పరిపాలనలో మహిళలపై ప్రతిరోజు ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్న విషయం మీకు తెలుస్తోందా?’ అనే శీర్షికతో పోస్టు చేసారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
सत्ता के संरक्षण में बदमाशों ने थामी अपराध की स्टेयरिंग !
राजस्थान के हनुमानगढ़ में दिनदहाड़े बदमाश कार के बोनट पर एक महिला को घसीट रहे हैं। गहलोत जी, रोज़ाना सरेआम जब ऐसी वारदात महिलाओं के साथ हो रही हैं तो क्या आपको अंदाज़ा भी है कि पूरे राजस्थान में आपके कुशासन में महिलाओं का… pic.twitter.com/ZvoyTRPuiI
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) August 16, 2023