Jammu and Kashmir: ఆర్టికల్ 370పై సంచలన ప్రకటన చేసిన గులాం నబీ ఆజాద్
కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ మరింత మునుగుతోందని, ఇక ప్రాంతీయ పార్టీల శక్తిసామర్థ్యాల గురించి చెప్పక్కర్లేదని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019లో పార్లమెంట్ రద్దు చేసింది. అప్పటి నుంచి కశ్మీర్లో వివిధ రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయమై రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి గుప్కార్ అలయెన్స్‌గా ఏర్పాటై బీజేపీపై పోరాటానికి దిగాయి.
- tony bekkal
- Published On : September 11, 2022 / 05:54 PM IST
Articel 370 Is Not Coming Back Says Ghulam Nabi Azad
Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ఇక తిరిగి రాదని కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే కొన్ని పార్టీలు ఈ విషయమై కశ్మీరీల్లో అపోహలను కల్పిస్తున్నారని, తాను మాత్రం అలాంటి అపోహలకు తావివ్వబోనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం బారాముల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.
మొదటిసారి ఉత్తర కశ్మీర్ అయిన బారాముల్లాలో బహిరంగ సభ నిర్వహించారు ఆజాద్. ఈ సమావేశానికి వచ్చిన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘‘గులాం నబీ ఆజాద్ ఎవరినీ తప్పుదోవ పట్టించాలని అనుకోవడం లేదు. ఓట్ల కోసం ఎవరికీ అబద్ధాలు చెప్పదల్చుకోలేదు. సాధ్యం కాని విషయాలపై చర్చలు, భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దని నేను విజ్ణప్తి చేస్తున్నాను. ఆర్టికల్ 370 ఇక ఎప్పటికీ తిరిగి రాదు. దానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. అది కశ్మీర్ నుంచి సాధ్యం కాదు’’ అని అన్నారు.
ఆర్టికల్ 370 తీసుకొచ్చే పరిస్థితిలో ఏ పార్టీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ మరింత మునుగుతోందని, ఇక ప్రాంతీయ పార్టీల శక్తిసామర్థ్యాల గురించి చెప్పక్కర్లేదని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019లో పార్లమెంట్ రద్దు చేసింది. అప్పటి నుంచి కశ్మీర్లో వివిధ రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయమై రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి గుప్కార్ అలయెన్స్‌గా ఏర్పాటై బీజేపీపై పోరాటానికి దిగాయి. జమ్మూ కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం గుప్కార్ కూటమి ఆధ్వర్యంలో కలిసి పోటా చేశాయి.
Ghulam Nabi Azad: ఎదరు చూపులకు తెర.. పది రోజుల్లో పార్టీ ప్రకటిస్తాని ఆజాద్ ప్రకటన
