పదవులు వద్దు.. సలహాలు ఇస్తాను : జైట్లీ చివరి సందేశం

రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉంటూ సేవలందించిన జైట్లీ శనివారం చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశనుంచి ఎన్నికల్లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ఒక్కసారే పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన అమృత్‌సర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత, ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ చేతిలో సుమారు లక్ష ఓట్ల ఆధిక్యం సంపాదించారు. ఫలితంగా జైట్లీకి ఓటమికి గురయ్యారు. 

2004 నుంచి అమృత్‌సర్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్థానంలో జైట్లీ పోటీ చేశారు. 2014లో అదే స్థానంలో బరిలోకి దిగిన ఆయన అమరీందర్ సింగ్ (కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురై ఓటమి పాలయ్యారు.

పదవులకు వీడ్కోలు:
మోడీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చే కొన్ని గంటల ముందు జైట్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కేంద్రమంత్రి వర్గంలో తాను భాగం కాలేనంటూ అవసరమైతే సలహాలు ఇవ్వగలనని నరేంద్ర మోడీకి ఆయన లేఖ రాశారు. అదే లేఖను సోషల్ మీడియాలో ఉంచి తన ఉద్దేశ్యాన్ని వెల్లడించారు. అప్పటికే ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నానని విశ్రాంతి కావాలని అందులో పేర్కొన్నారు. 

ఎన్నికల ప్రచార సమయంలో తనకు ఇచ్చిన పనిని పూర్తి చేశానని భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలను స్వీకరించలేనని మోడీకి తెలిపినట్లు జైట్లీ లేఖలో వివరించారు. 1952, నవంబర్ 28న ఢిల్లీలో జన్మించిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇకలేరు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందించారు.