సోషల్ మీడియా స్టార్: అరుణాచల్ అమ్మాయి అమెరికా ఆర్మీలో చేరింది…సన్సేషన్ క్రియేట్ చేస్తోంది

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి నికి లెగో.. యుఎస్ ఆర్మీలో చేరి ఇప్పుడు జార్జియాలో పోస్టింగ్ తీసుకుంది. యూఎస్‌ఆర్మీ యూనిఫాంలో ఆమె దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. 2019లో ఆమె అమెరికా ఆర్మీ ఇంటర్వ్యూలో ఉత్తిర్ణత సాధించిన తర్వాత నికి లెగో ఇటీవల బాధ్యతల్లో చేరారు. మార్చి 5వ తేదీన ఆమె శిక్షణ పూర్తి చేశారు.
జార్జియాలోని సిస్టమ్ మేనేజ్‌మెంట్ మరియు ఇంజనీరింగ్ బృందానికి పని చేస్తున్నారు. ఆమె సాధించిన ఈ విజయం ఇప్పుడు వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా వైరల్ అవుతుంది. కాంగ్రెస్ నాయకురాలు, అరుణాచల్ ప్రదేశ్ మాజీ పార్లమెంటు సభ్యుడు నినోంగ్ ఎరింగ్ కూడా నికి లెగో గురించి రాసిన కథనాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈశాన్య రాష్ట్రం నుంచి అమెరికా ఆర్మీకి వెళ్ళినందుకు ప్రతిఒక్కరు ఆమెను అభినందిస్తున్నారు. లెగో సాధించిన విజయాన్ని ‘నారి శక్తి’ (మహిళా సాధికారత) అని ప్రశంసిస్తున్నారు. ‘ఈశాన్య భారతదేశంలో యువతులకు ఆమె ప్రేరణ’ అని కొనియాడుతున్నారు.
Congratulations to Ms. Nikki Lego for the achievement. It will inspire the youth of Arunachal Pradesh to chase their dreams.@Google @sundarpichai https://t.co/KORnRxJwOn
— Ninong Ering (@ninong_erring) March 15, 2020
లెగో తన పాఠశాల విద్యను అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ మోడల్ స్కూల్‌లో పూర్తి చేసింది. తరువాత షిల్లాంగ్‌లోని లేడీ కీనే కాలేజీ నుండి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. దాంతో పలు సంస్థల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా పనిచేయడానికి ఆమె అమెరికాకు వెళ్లారు. అక్కడి నుంచి న్యూయార్క్ లో ఉండగా ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యారు.