ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు కూడా నేర్పిస్తాం

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్, బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు నేర్పిస్తామన్నారు. ప్రధానికి

  • Publish Date - February 16, 2020 / 11:35 AM IST

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్, బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు నేర్పిస్తామన్నారు. ప్రధానికి

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్, బీజేపీపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తమ పిల్లలకూ నేర్పిస్తామన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైలుకి పంపినా వెళ్తామన్నారు. 25ఏళ్లుగా భద్రత లేకుండా తిరుగుతున్నా అని చెప్పిన ఒవైసీ.. నన్ను చంపాలనుకుంటే చంపేసుకోవచ్చని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ కూడా అవసరం లేదన్న ఒవైసీ.. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు తన చెప్పుతో సమానం అన్నారు. కాంగ్రెస్.. ఎప్పటికీ అధికారంలోకి రాదని ఒవైసీ జోస్యం చెప్పారు. కర్నాటకలోని గుల్బార్గాలో ఓ బహిరంగ సభలో ఒవైసీ ఈ కామెంట్స్ చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఒవైసీకి కొత్త కాదు. గతంలోనూ అనేకసార్లు తన వ్యాఖ్యలతో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. బీజేపీ అంటే భగ్గుమంటారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని అసద్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలకు ద్రోహం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపిస్తున్నారు. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు. 

తాజాగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేశాయి. ప్రధానికి వ్యతిరేకంగా ఆయన అన్న మాటలు దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు నా చెప్పుతో సమానం అంటూ అసద్ అన్న మాటలూ మంటలు పుట్టిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ నేతల రియాక్షణ్ ఎలా ఉంటుందో చూడాలి.