Rajastan Crisis: రాజస్తాన్ సీఎంగా తానే కొనసాగుతానని పరోక్ష సూచనలు చేసిన గెహ్లాట్

బడ్జెట్‭కు సంబంధించి తగిన సూచనలు చేయాలని ప్రజలను కోరారు. యువత, విద్యార్థులు, ఇతర ప్రజలు ఎవరైనా సరే.. బడ్జెట్ ప్రతిపాదనలను, వారి అభిలాషలను ప్రభుత్వానికి పంపాలని, వాటి ద్వారా ప్రభుత్వం అత్యుత్తమ పథకాలను రూపొందిస్తుందని అన్నారు. ఈ సందేశాలు నేరుగా తనకే పంపవచ్చని గెహ్లాట్ పేర్కొన్నారు. ఆర్థిక శాఖను తన వద్దే పెట్టుకున్న గెహ్లాట్.. తాజా ప్రభుత్వంలో మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు

Rajastan Crisis: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగిన అశోక్ గెహ్లాట్ రాజకీయ భవిష్యత్‭పై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అందులో మొదటిది, ముఖ్యమైనది రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనకు హుళక్కేనని. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ రాజస్తాన్ ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని గెహ్లాట్ పరోక్ష సంకేతాలు చేశారు. వాస్తవానికి ఈ విషయమై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని ఇంతకు ముందే గెహ్లాట్ చెప్పినప్పటికీ.. తాజాగా ముఖ్యమంత్రి తానే అనే విధంగా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

తాజాగా ఆయన రాష్ట్ర బడ్జెట్ విషయమై మాట్లాడుతూ.. బడ్జెట్‭కు సంబంధించి తగిన సూచనలు చేయాలని ప్రజలను కోరారు. యువత, విద్యార్థులు, ఇతర ప్రజలు ఎవరైనా సరే.. బడ్జెట్ ప్రతిపాదనలను, వారి అభిలాషలను ప్రభుత్వానికి పంపాలని, వాటి ద్వారా ప్రభుత్వం అత్యుత్తమ పథకాలను రూపొందిస్తుందని అన్నారు. ఈ సందేశాలు నేరుగా తనకే పంపవచ్చని గెహ్లాట్ పేర్కొన్నారు. ఆర్థిక శాఖను తన వద్దే పెట్టుకున్న గెహ్లాట్.. తాజా ప్రభుత్వంలో మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం ఆయన బడ్జెట్ గురించి మాట్లాడుతుండడాన్ని చూస్తుంటే.. ఆర్థిక మంత్రిగా మరోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారనే విషయం తెలుస్తూనే ఉంది. ఇక ముఖ్యమంత్రి పీఠంపై ఆయన కొనసాగుతారనేది కూడా వెల్లడవుతోంది.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘యువత, పిల్లల కోసం బడ్జెట్ ప్రవేశపెడతాం. ప్రజలు, యవకులు, విద్యార్థులు తమ సూచనలను నేరుగా నాకే పంపించాలని విజ్ణప్తి చేస్తున్నాను. యువత సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. యువతే దేశ భవిష్యత్. వారు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

5G in India: వచ్చే ఏడాది డిసెంబర్ వరకు అంటూ.. 5జీ సేవలపై వాగ్దానం చేసిన ముకేశ్ అంబానీ

ట్రెండింగ్ వార్తలు