పామును కాపాడబోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు

బావిలో పామును కాపాడబోయిన సహాయకుడు చిక్కుల్లో పడిన ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో చోటు చేసుకుంది.

  • Publish Date - December 13, 2019 / 03:07 AM IST

బావిలో పామును కాపాడబోయిన సహాయకుడు చిక్కుల్లో పడిన ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో చోటు చేసుకుంది.

బావిలో పామును కాపాడబోయిన సహాయకుడు చిక్కుల్లో పడిన ఘటన కేరళలోని త్రిస్సూర్‌లో చోటు చేసుకుంది. ఓ పాము బావిలో పడటంతో షగిల్‌.. వల వేసి దాన్ని బయటకు తెద్దామనుకున్నాడు.. కానీ ఆ బావి లోతుగా ఉండటంతో అది కుదర్లేదు. దీంతో అతనే నేరుగా బావిలోకి దూకి రక్షించాలనుకున్నాడు. వెంటనే తాళ్ల సాయంతో ఎలాగోలా బావిలోకి దిగాడు. పాము కాటు వేయకుండా నెమ్మదిగా దాని తలను అదిమి పట్టుకున్నాడు. వెంటనే ఆ పొడవాటి పాము ఏదో ప్రమాదం జరుగుతున్నదానిలా అతని శరీరాన్ని చుట్టుకుంది.

దీంతో అక్కడి స్థానికులు షగిల్ ను పైకి లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చేయి పట్టుతప్పడంతో ఒక్కసారిగా పాముతో పాటు అతను కూడా బావిలోకి పడిపోయాడు. అనంతరం షగిల్ తాడు సాయంతో మెళ్లగా పైకి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అతనికి, పాముకు ఎలాంటి గాయాలు కాలేదు. తిరిగి ఆ పామును అడవిలో విడిచిపెట్టారు.