Bengali Actor: బుక్ ఫెయిర్‌లో దొంగతనం చేసి దొరికిపోయిన ఆ హీరోయిన్

యాక్టర్ అయిన ఓ యువతి ఇంటర్నేషనల్ కోల్‌కతా బుక్ ఫెయిర్ వేదికగా పర్సులు దొంగతనం చేస్తూ దొరికిపోయింది. అక్కడకు వచ్చిన వారి అటెన్షన్ డైవర్ట్ చేస్తూ కొట్టేస్తున్నట్లు పోలీసులు...

Purse Stealing

Bengali Actor: యాక్టర్ అయిన ఓ యువతి ఇంటర్నేషనల్ కోల్‌కతా బుక్ ఫెయిర్ వేదికగా పర్సులు దొంగతనం చేస్తూ దొరికిపోయింది. అక్కడకు వచ్చిన వారి అటెన్షన్ డైవర్ట్ చేస్తూ కొట్టేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

చాలా యాడ్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా నటించిన మిస్ దత్తా.. సోప్ యాడ్స్ ద్వారా బాగా ఫ్యామస్ అయింది. దొంగతనం చేస్తుండగా పోలీసులు గమనించారని పర్సును చెత్త డబ్బాలో విసురుతుండగా దొరికిపోయిందని బీదన్ నగర్ పోలీసులు చెబుతున్నారు.

అనుమానంతో ప్రశ్నించేసరికి నిజం బయటికొచ్చింది. ఆ ఈవెంట్ లో మొత్తం దొంగిలించిన సొమ్ము రూ.75వేల వరకూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Read Also : ప్రేయసి కోసం శానిటరీ ప్యాడ్‌లు దొంగతనం చేసిన ప్రియుడు

‘ఇతరులతో ఒక టీంలా ఏర్పడి అటెన్షన్ డైవర్ట్ చేయడం, ఏమరుపాటుకు గురి కాగానే పర్సులు కొట్టేయడం వంటివి చేస్తున్న టీం మొత్తాన్ని అరెస్టు చేశాం’ అని అధికారులు తెలిపారు.

గతంలో అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు దత్తా.