ఆధార్ హెచ్చరిక: లామినేషన్ చేశారంటే డేటా దోచేస్తారు

ఒరిజినల్ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఎక్కడ పాడైపోతాయోయని డూప్లికేట్లు లామినేట్ చేయించుకుని వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆధార్ కార్డ్ భద్రంగా ఉంచుకోవడం మాట అటుంచితే మన డేటాను చోరీ చేయడం ఈజీ అవుతుందట. యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 

అటువంటి డూప్లికేట్ల జోలికి పోవద్దంటూ హెచ్చరించింది. ఇలా లామినేషన్ చేయడం వల్ల ఆధార్ కార్డు క్యూఆర్ కోడ్ పని చేయకుండా పోవచ్చని తెలిపింది. ఇలా ప్లాస్టిక్ లామినేషన్ చేయించడంలో వ్యక్తిగత సమాచారం మన అనుమతి లేకుండానే దొంగిలించే ప్రమాదాలు ఉన్నట్లు తెలిపింది. 

ప్లాస్టిక్ ఆధార్ కార్డు వాడడం వల్ల ప్రమాదాలతో పాటు వీటి కోసం రూ.50నుంచి రూ.300వరకూ వెచ్చిస్తుంటారు. ఆధార్ కార్డులో చివరి భాగం ఉన్నా సరిపోతుందని స్మార్ట్ కార్డ్ ఇస్తామంటూ వందల్లో డబ్బులు అడిగితే మోసపోకూడదు. ఆధార్ ఈ లెటర్ కూడా సరిపోతుంది కానీ, స్మార్ట్ కార్డే కావాలని ఎటువంటి రూల్స్ లేవు.