Ayodhya Ram Mandir CEO: అయోధ్య రామాలయానికి తొలి CEO ఎవరు? నేడే అధికారిక ప్రకటన.. లిస్టులో ఎవరెవరున్నారో తెలుసా?
అయోధ్య రామాలయ నిర్వహణకు సంబంధించి తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Ayodhya Ram Mandir CEO) పేరును శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అధికారికంగా ప్రకటించనుంది.
- V Santhosh Kumar
- Published on- September 2, 2026 / 07:16 AM IST
Ayodhya ram mandir trust to announce first ever ceo today
- రామాలయానికి తొలి సీఈవో ప్రకటన
- నేడు కీలక సమావేశం ఏర్పాటు
- ట్రస్టులో ముగ్గురి పేర్ల పరిశీలన
Ayodhya Ram Mandir CEO: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రసిద్ధ అయోధ్య రామాలయ నిర్వహణకు సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు బుధవారం ఒక చారిత్రక నిర్ణయం తీసుకోనుంది. ఆలయ నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Ayodhya Ram Mandir CEO) పేరును అధికారికంగా ప్రకటించనుంది. ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ నివాసంలో మధ్యాహ్నం జరగనున్న కీలక సమావేశంలో ఎంపిక కమిటీ ముగ్గురు అభ్యర్థుల తుది జాబితాను సమర్పించనుంది. ఈ సమావేశంలోనే సీఈవోతో పాటు ట్రస్టులోని ఇతర కీలక పదవులపై తుది నిర్ణయం తీసుకోనుండటంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. అధికారులకు పవన్ వార్నింగ్.. కీలక ఆదేశాలు
5,585 దరఖాస్తులు.. 16 మందికి ఇంటర్వ్యూలు:
రామాలయ సీఈవో పదవి కోసం దేశవ్యాప్తంగా ఏకంగా 5,585 దరఖాస్తులు రాగా, కమిటీ తీవ్రంగా పరిశీలించి చివరికి 16 మందిని ఇంటర్వ్యూ చేసింది. రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కొహ్లీ, రిటైర్డ్ ఎల్జీ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణుడు సురేశ్ హావ్డేలతో కూడిన ఎంపిక కమిటీ ఇప్పటికే అయోధ్యకు చేరుకుంది. ఇటీవల ఆలయంలో కానుకలు, విరాళాల చోరీ ఆరోపణల నేపథ్యంలో చంపత్‌రాయ్, అనిల్‌మిశ్ర తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్ర మరణంతో ఖాళీ అయిన మూడు స్థానాలను ఈ భేటీ ద్వారా భర్తీ చేయనున్నారు.
ముందస్తు రేసులో జగదీశ్ ఆఫ్లే, బజరంగ్ లాల్ బాగ్డా:
ఈ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆలయ ట్రస్టు తొలి కార్యదర్శిగా ఐఐటీ బాంబే ఎంటెక్ గ్రాడ్యుయేట్, రామాలయ నిర్మాణ ప్రాజెక్ట్ మేనేజరుగా పనిచేసిన జగదీశ్ ఆఫ్లే పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అలాగే వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాగ్డాకు కూడా ట్రస్టులో కీలక బాధ్యతలు దక్కే అవకాశం కనిపిస్తోంది. సీఈవో ఎంపిక పూర్తయితే రామాలయ రోజువారీ పరిపాలన, భద్రత, విరాళాల పర్యవేక్షణ మరింత పక్కాగా సాగుతుందని విశ్వహిందూ పరిషత్, అటవీ-రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
