Ayodhya sets world record by lighting over 15 lakh diyas on Deepotsav in PM Modi's presence
Deepotsav: దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. 15 లక్షలకు పైగా దీపాలతో చేపట్టిన ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఆదివారం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. గిన్నీస్ రికార్డ్ సర్టిఫికెట్ను ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బయటికి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ‘‘రాముడి పవిత్ర జన్మస్థలం నుంచి నా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయోధ్యలో జరిగే దీపోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీక్షించడం సంతోషంగా ఉంది. రాముడి నుంచి దేశ ప్రజలు చాలా నేర్చుకోవాలి. రాముడు తన వాళ్లందరికీ తోడుగా ఉన్నాడు. ఎవరినీ విడిచి పెట్టలేదు, ఎవరికీ దూరంగా ఉండలేదు’’ అని అన్నారు. దీపోత్సవ వేడుకల కోసం అయోధ్య చేరుకున్న వెంటనే రామజన్మభూమిలో రామ్ లల్లాకు మోదీ ప్రార్థనలు చేశారు. ఆగస్ట్ 5, 2020న రామ మందిర నిర్మాణం కోసం మోదీ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.
సరయూ బ్యాంకు సమీపంలోని రామ్‌కీ పైడి వద్ద నిర్వహించిన దీపోత్సవ వేడుకల్లో 22,000 మంది వాలంటీర్లు 15 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగించనున్నట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ నవదీప్ రిన్వా తెలిపారు. ఇవే కాకుండా పట్టణంలోని ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్లో కూడా దీపాలను వెలిగించారు. ఇక ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఐదు యానిమేటెడ్ టేబులాక్స్, వివిధ రాష్ట్రాల నుంచి నృత్య రూపాలను ప్రదర్శించే 11 రామ్లీలా టేబులాక్స్ కూడా దీపోత్సవంలో ప్రదర్శించారు.
Kejriwal on Rewadi: బీజేపీ రేవడీ వ్యాఖ్యలపై మండిపడ్డ కేజ్రీవాల్.. ఉచితాలనొద్దంటూ హితవు