×
Ad

Ayyappa Devotees: విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇకపై అందుకు అనుమతి..

ఈరోజు నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక సడలింపు వర్తిస్తుంది. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన...

Ayyappa Devotees: విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్పస్వాములకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విమాన ప్రయాణం సమయంలో పవిత్ర ఇరుముడిని ఇకపై తమతో పాటు హ్యాండ్ లగేజీగా క్యాబిన్ లోకి తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. అయ్యప్పస్వాములకు బిగ్ రిలీఫ్ గా చెప్పొచ్చు.

ప్రస్తుతం అమల్లో ఉన్న విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం ఇరుముడిలోని కొబ్బరికాయ కారణంగా దాన్ని తప్పనిసరిగా చెక్ ఇన్ లగేజ్ గా పంపాల్సి వచ్చేది. తమ భక్తికి ప్రతీకగా భావించే ఇరుముడిని లగేజీలో పంపడం భక్తులకు అసౌకర్యంగా ఉండేది. ఈ సమస్యపై దృష్టి సారించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నారు. వారి మనోభావాలను గౌరవిస్తూ ప్రత్యేక చొరవ చూపించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, సంబంధిత భద్రతా సంస్థలతో చర్చలు జరిపి అయ్యప్ప స్వాముల కోసం ఈ ప్రత్యేక మినహాయింపు తీసుకొచ్చారు.

ఈరోజు నుంచి 2026 జనవరి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ ప్రత్యేక సడలింపు అమల్లో ఉంటుంది. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన తర్వాత తమ ఇరుముడిని హ్యాండ్ లగేజ్ గా విమాన క్యాబిన్‌లోకి తమతో పాటు తీసుకెళ్లొచ్చు.

కాగా, భక్తులు కచ్చితంగా ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియలో అధికారుల సూచనలు, గైడ్ లైన్స్ ను కచ్చితంగా పాటించాలని కోరారు.

కేంద్రం కల్పించిన ఈ వెసులుబాటు పట్ల అయ్యప్పస్వాములు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో తమ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని అంటున్నారు.

Also Read: కిరాణ సామాన్లు, కూరగాయలు, పండ్లు ఈ- కామర్స్‌లో ఆర్డర్ చేస్తున్నారా..? బీకేర్ ఫుల్.. అధికారుల సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు