Bachpan Ka Pyara : ‘బచ్‌పన్ కా ప్యారా’ ఫేమ్ సహదేవ్‌కు రోడ్డు ప్రమాదం.. తలకు బలమైన గాయాలు
'బచ్‌పన్ కా ప్యార్' వీడియోతో సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయిన సహదేవ్ డిర్డో డిసెంబర్ 28 మంగళవారం (సెప్టెంబర్ 28, 2021) ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు
- kunduru Vinod
- Published On : December 29, 2021 / 07:27 AM IST
Bachpan Ka Pyara
Bachpan Ka Pyara : ‘బచ్‌పన్ కా ప్యార్’ వీడియోతో సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయిన సహదేవ్ డిర్డో డిసెంబర్ 28 మంగళవారం (సెప్టెంబర్ 28, 2021) ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తన తండ్రితో కలిసి బైక్‌పై ఛత్తీస్‌గఢ్‌లోని సొంతూరుకు వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో సహదేవ్ డిర్డో తలకు బలమైన గాయమైంది. మొదట సహదేవ్‌ని క్లినిక్ కి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం సుక్మా జిల్లా ఆసుపత్రి ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం.. జగదల్‌పూర్‌లోని మెడికల్ కాలేజీకి తరలించారు.
చదవండి : Bachpan Ka Pyaar : ఒక్క పాటతో ఫేమస్ అయిపోయిన బుడ్డోడు.. ఏకంగా ఇండియన్ ఐడల్‌లో ప్రత్యక్షం
రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న సుక్మా జిల్లా కలెక్టర్ వినీత్ బందన్వార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ శర్మలు ఆసుపత్రికి చేరుకొని సహదేవ్ డిర్డో ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీ తరలిస్తామని అధికారులు తెలిపారు. సహదేవ్ డిర్డోకి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలియడంతో సెలెబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ ర్యాపర్ బాద్షా, సహదేవ్ డిర్డో ఉన్న ఆసుపత్రికి వెళ్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
చదవండి : Tweet Using Mind : వండర్.. ఒళ్లంతా చచ్చుబడిన వ్యక్తి ట్వీట్ చేశాడు.. వరల్డ్ ఫస్ట్ పర్సన్
