Bachpan Ka Pyaar : ఒక్క పాటతో ఫేమస్ అయిపోయిన బుడ్డోడు.. ఏకంగా ఇండియన్ ఐడల్‌లో ప్రత్యక్షం

సోషల్‌ మీడియా పుణ్యమా అని మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నారు. ఇలా ఓవర్‌నైట్‌ స్టార్లుగా మారిన వారు ఎందరో. తాజాగా ఓ బుడ్డోడు కూడా ఒక పాట పాడి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఒక్క పాటతో ఏకంగా ప్రముఖ పాటల షోలో ప్రత్యక్షమయ్యాడు.

Bachpan Ka Pyaar : ఒక్క పాటతో ఫేమస్ అయిపోయిన బుడ్డోడు.. ఏకంగా ఇండియన్ ఐడల్‌లో ప్రత్యక్షం

Bachpan Ka Pyaar

Bachpan Ka Pyaar : సోషల్‌ మీడియా పుణ్యమా అని మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నారు. ఇలా ఓవర్‌నైట్‌ స్టార్లుగా మారిన వారు ఎందరో. తాజాగా ఓ బుడ్డోడు కూడా ఒక పాట పాడి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఒక్క పాటతో ఏకంగా ప్రముఖ పాటల షోలో ప్రత్యక్షమయ్యాడు.

ఆ పిల్లాడే చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్‌ డిర్డో. ‘బచ్ పన్ కా ప్యార్ హై’ పాట స్కూల్లో సరదాగా పాడుతుండగా కొందరు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అంతే, ఈ వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు చేరింది. ఆ బుడతడి గొంతు విని అందరూ ఫిదా అయ్యారు. జూలై 3న విడుదలైన ఆ వీడియోకి ఇప్పటివరకు 9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బాఘేల్ సైతం హసదేవ్‌ని ప్రశంసించారు. తన దగ్గరికి పిలిచి మరీ ‘బ‌చ్ ప‌న్ కా ప్యార్’ అంటూ పాట పాడించుకుని దీవించారు. అనంతరం ఆ వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ కూడా ఫిదా అయిపోయారు. ఇప్పుడు హసదేవ్‌ సోనీ టీవీ నిర్వహించే ప్రఖ్యాత పాటల షో ఇండియన్‌ ఐడల్‌-12 పోటీల్లో ప్రత్యక్షమై సందడి చేశాడు. బచ్‌పన్‌ కా ప్యార్‌ పాట పాడాడు. ప్రముఖ నేపథ్య గాయకుడు ఆదిత్య నారాయణ్‌ ఈ వీడియోని షేర్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Aditya Narayan (@adityanarayanofficial)