Kosal State Demand: కొత్త రాష్ట్రం డిమాండ్.. ఒడిశాలోని పది జిల్లాల్లో బంద్

కోశల్ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ‘వెస్ట్రన్ ఒడిశా యువ మార్చ్, కోశల్ యూత్ కోర్డినేషన్ కమిటీ, కోశల్ స్టేట్ కోర్డినేషన్ కమిటీ, కోశల్ సేన, కోవల్ ముక్తి మోర్చాలు ప్రధానంగా ఆందోళన చేస్తున్నాయి. ఒడిశాలోని పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి చాలా దూరంగా ఉందని, ఈ ప్రాంతాన్ని పాలకులు నిర్లక్ష్యం చేశారనే కారణంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఏర్పడింది.

Bandh in 10 Odisha districts demanding separate state

Kosal State Demand: తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రాంతీయ ఉద్యమాలు జరిగాయి. అయితే తెలంగాణ స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగలేదు. బహుశా ఇదే కారణంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం విజయం సాధించింది. మిగతా ఉద్యమాలు వెనుకబడి పోయాయి. అయితే తాజాగా ఒడిశాలో కోశల్ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ కొనసాగుతోన్న ఉద్యమం ఊపందుకున్నట్లే కనిపిస్తోంది. ఒడిశాలోని పది జిల్లాలను కలుపుకుని కోశల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది స్థానికుల డిమాండ్. గత ముప్పై ఏళ్లుగా ఈ ఉద్యమం సాగుతోంది.

ఈ విషయమై కోశల్ రాష్ట్రంగా ఆందోళనకారులు పరిగణిస్తున్న పది జిల్లాల్లో గురువారం బంద్ పాటించారు. కోశల్ రాయిజ్ ముక్తి మోర్చా, కోశల్ సేన ఈ బంద్‭కు పిలుపునిచ్చాయి. తమకు రాష్ట్ర రాజధాని చాలా దూరంలో ఉందని, అలాగే తమ ప్రాంతానికి అభివృద్ధికి దూరం చేశారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆయుధంగా దొరికింది. కొశల్ రాష్ట్ర ఏర్పాటు న్యాయమైందని, 22 ఏళ్లుగా రాష్ట్రీన్ని ఏలుతోన్న బిజూ జనతా దళ్.. పశ్చిమ ఒడిశాను నిర్లక్ష్యం చేసిందని విమర్శలు గుప్పిస్తున్నాయి.

కోశల్ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ‘వెస్ట్రన్ ఒడిశా యువ మార్చ్, కోశల్ యూత్ కోర్డినేషన్ కమిటీ, కోశల్ స్టేట్ కోర్డినేషన్ కమిటీ, కోశల్ సేన, కోవల్ ముక్తి మోర్చాలు ప్రధానంగా ఆందోళన చేస్తున్నాయి. ఒడిశాలోని పశ్చిమ ప్రాంతం అభివృద్ధికి చాలా దూరంగా ఉందని, ఈ ప్రాంతాన్ని పాలకులు నిర్లక్ష్యం చేశారనే కారణంతో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఏర్పడింది. అయితే కొద్ది సంవత్సరాల క్రితం వెస్ట్రన్ ఒడిశా డెవలప్‭మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్‭లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ వస్తున్నప్పటికీ.. దీని వెస్ట్రన్ ఒడిశా డెవలప్‭మెంట్ కౌన్సిల్ కేంద్ర కార్యాలయం ఒడిశా రాజధాని భుబనేశ్వర్‭లోనే ఉండడాన్ని ఇక్కడి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

PK Tweet On Nitish: మోదీ, నితీశ్ కలిసున్న 4 ఫొటోలు ట్వీట్ చేసి వెంటనే డిలీల్ చేసిన ప్రశాంత్ కిశోర్