బ్యాంకు సిబ్బందికి 15% పెరిగిన జీతాలు

Bank salaries: దాదాపు 8లక్షల మంది పబ్లిక్, ప్రైవేట్, విదేశీ బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. యూనియన్స్ అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అధికారికంగా ఈ సెటిల్మెంట్ పై సంతకం చేసింది. బ్యాంకులు 2017-22 మధ్య సమయంలో ఉద్యోగుల జీతాలను 15శాతం పెంచింది.
ఈ రివిజన్ ఆధారంగా బ్యాంకు ఇండస్ట్రీ వేతనాలు రూ.7వేల 898కోట్లు పెరిగాయి. జులైలో దీనిపై బ్యాంకులు సంతకం పెట్టాయి. యూనియన్స్, ఐబీఏల ఒప్పందం ప్రకారం.. బ్యాంకు నుంచి పెన్షన్ పొందే వారికి రూ.11వేలు అందే పెన్షన్ రూ.30వేల వరకూ పెరిగింది.
దీంతో పర్‌ఫార్మెన్స్ ఆధారంగా పెరిగే ఇన్సెంటివ్స్ కూడా పెంచనున్నారు. సంవత్సరాంతం చేసిన ప్రదర్శన ఆధారంగా సాధారణ జీతం కంటే ఎక్కువ హైక్ ఇవ్వనుంది.
నిజానికి ట్రేడ్ యూనియన్లు 20శాతం హైక్ డిమాండ్ చేస్తే దానిని ఐబీఏ 12.5శాతం నుంచి మొదలుపెట్టి 15శాతం వరకూ సక్సెస్ అయింది.