Chiranjeevi : మెగాస్టార్‌తో ధురంధర్ ఫేమ్ సారా అర్జున్..!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బాబీ కాంబినేషన్లో స్టార్ట్ కాబోతున్న సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది.
Gossip Garage Dhurandhar fame Sara Arjun with Megastar
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో స్టార్ట్ కాబోతున్న సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది. మెగాస్టార్ డాటర్‌గా ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ను తీసుకున్నట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయ్. ముందుగా ఉప్పెన భామ కృతిశెట్టి, ఛాంపియన్ మూవీ ఫేమ్ అనస్వర పేర్లు బాగా వినిపించాయి. దాదాపు కన్ఫామ్ అనే టాక్ కూడా వినిపించింది.
కానీ లేటెస్ట్ ధురంధర్ మూవీ ఫేమ్ సారా అర్జున్ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాబీ డైరెక్షన్లో చేయబోయే మూవీలో చిరు నడి వయస్కుడిగా నటిస్తున్నారు. చిరంజీవి కూతురుగా సారా నటించబోతున్నట్లు చెబుతున్నారు.
Vithika Sheru : భర్త వరుణ్ సందేశ్ తో కలిసి నటి వితిక షేరు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
సారా అర్జున్ చిన్నమ్మాయిగా ఉండగా నాన్న సినిమాలో విక్రమ్ కూతురుగా యాక్ట్ చేసింది. తర్వాత టీనేజీలోకి వచ్చాక పొన్నియన్ సెల్వన్ సినిమాలో యంగ్ ఐశ్వర్యారాయ్ పాత్ర చేసింది. తర్వాత ధురంధర్ మూవీలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా హిందీలో అత్యధిక కలెక్షన్స్ వసూళ్లు చేసింది.
ఇక మరో తెలుగు మూవీ భూమికతో కలిసి యుఫోరియా అనే సినిమాలో సారా అర్జున్ యాక్ట్ చేసింది. ఇక మెగాస్టార్, బాబీ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనే టాక్ నడుస్తుంది. తండ్రీ కూతురుగా చిరంజీవి.. సారా అర్జున్ కాంబో ఫిక్సా..లేక జస్ట్ రూమర్సా అనేది మూవీ టీమే క్లారిటీ ఇవ్వాలి.
